Idream media
Idream media
దేశ వ్యాప్తంగా న్యాయవ్యవస్థను బలోపేతం చేసే దిశగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఖ్యను పెంచుతున్నారు. తాజాగా తెలంగాణా హైకోర్ట్ కి సంబంధించి కీలక అడుగుపడింది. తెలంగాణ హైకోర్టు కు 12 మంది న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు సిఫారసు చేసింది.
ఏడుగురు న్యాయవాదులు, అయిదుగురు న్యాయాధికారులను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు గా సిఫార్సు చేసింది.
ఒకసారి న్యాయవాదుల జాబితా చూస్తే… శ్రీ కాసోజు సురేందర్, శ్రీ చాడా విజయభాస్కర్ రెడ్డి, శ్రీమతి సూరేపల్లి నంద, శ్రీ ముమ్మినేని సుదీర్ కుమార్, శ్రీమతి జువ్వాది శ్రీదేవి, శ్రీ మీర్జా సైఫుల్లా, శ్రీ నచరాజు శ్రవణ కుమార్ లను సిఫారసు చేేశారు. అనుభవానికి ఎక్కువగా సుప్రీంకోర్టు ప్రాధాన్యత ఇచ్చింది. ట్రాక్ రికార్డు తో పాటుగా రాజకీయ విమర్శలు ఎదుర్కొనే వారి పేర్లను పక్కన పెట్టింది.
న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చూస్తే… శ్రీమతి అనుపమా చక్రవర్తి, శ్రీమతి ఎమ్జీ ప్రియదర్శిని, శ్రీ సాంబశివరావు నాయుడు, శ్రీ సంతోష్ రెడ్డి, శ్రీ డాక్టర్ నాగరాజన్ పేర్లను సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ కు కూడా త్వరలోనే సిఫారసు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. విమర్శలు ఉన్న న్యాయవాదులు, జడ్జిల మీద కూడా సుప్రీంకోర్టు ఒక కన్నేసి ఉంచింది. రాజకీయ నాయకులకు సహకరించే వారి మీద సీరియస్ గా ఫోకస్ చేసింది. అటు అవినీతి ఆరోపణలు వచ్చే వారికి, తీర్పుల విషయంలో విజ్ఞత లేకుండా ఇచ్చే వారికి డిమోషన్ లు ఇస్తుంది. ఇటీవల బొంబాయి హైకోర్ట్ కి చెందిన న్యాయమూర్తికి జిల్లా కోర్టుకి డిమోట్ చేసింది.