iDreamPost
android-app
ios-app

ఉద్యోగ, ఉపాధికి కరోనా దెబ్బ

  • Published Jul 28, 2020 | 3:11 PM Updated Updated Jul 28, 2020 | 3:11 PM
ఉద్యోగ, ఉపాధికి కరోనా దెబ్బ

లాక్డౌన్‌ కారణంగా ఏర్పడిన గడ్డు పరిస్థితుల ప్రభావం ఉద్యోగ, ఉపాధి రంగాల్లోని సుమారు 66 శాతం మందిపై పడిందని ఇటీవల జరిగిన ఓ సర్వే తేల్చింది. దీని కారణంగా చేస్తున్న ఉద్యోగం, ఉపాధులను కోల్పోవాల్సి వచ్చిందని సర్వే సంస్థ పేర్కొంది. ఈ సర్వే ద్వారా ప్రస్తుతం, రానున్న రోజుల్లో ఏర్పడి సామాజిక, ఆర్ధిక పరిస్థితులు అంచనా వేసేందుకు ప్రయత్నించారు. తద్వారా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయని తేలింది. చౌక ధరల దుకాణాల ద్వారా వస్తువులు అందించడం, ఆర్ధిక పోత్రాహకాలనే నేరుగా ఆయా కుటుంబాలకు చేరవేయడం ద్వారా ప్రస్తుత గడ్డు పరిస్థితి ఎదుర్కొనేందుకు వారికి అవకాశం లభిస్తుందన్నది సర్వే సారాంశం.

ఇదిలా ఉండగా ఉద్యోగులు భవిష్య నిధి కోసం పొందుపు చేసుకునే పీఎఫ్‌ను డ్రా చేస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలోని దాదాపు 30వేల కోట్లును 80 లక్షల మంది ఉద్యోగులు డ్రా చేసుకున్నారు. సాధారణంగా ప్రతి ఆర్ధిక సంవత్సరంలోనూ జరిగే ఉపసంహరణలకంటే అత్యధికంగా ఉద్యోగులు పీఎఫ్‌ను విత్‌డ్రాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన వాటిలో కరోనా విండ్‌ క్రింద 30 లక్షల మంది వరకు ఉద్యోగులు 8వేల కోట్లు, సాధారణ ఉపసంహరణల క్రింద యాభై లక్షల మంది ఉద్యోగులు 22వేల కోట్లను, వీటిలో కూడా మెడికల్‌ అడ్వాన్సుల రూపంలోనే తీసుకున్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

లాక్డౌన్‌ నేపథ్యంలో అసంఘటిత రంగంలోని వారికి మాదిరిగానే ఉద్యోగుల జీతాలు కూడా పెండింగ్‌లో పడ్డాయి. ప్రైవేటు ఫర్స్‌S్మలో పనిచేసేవారికైతే జీతాలే తగ్గిపోవడమో లేదా ఇవ్వకపోవడమో జరుగుతోంది. దీంతో వారంతా తమతమ పీఎఫ్‌ పొందుపును డ్రా చేసుకునేందుకుమొగ్గు చూపుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. గత యేడాది ఆర్ధిక సంవత్సరం మొత్తం 70వేల కోట్లు విత్‌డ్రాలు చేసుకోగా, ఈ యేడాది కేవలం నాలుగు నెలల్లోనే 30వేల కోట్లు విత్‌డ్రాలవ్వడం లాక్డౌన్‌ వారివారి ఆదాయాల మీద ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అంచనా వేయొచ్చు. కరోనా తెచ్చిన లాక్డౌన్‌ కారణంగా ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఏర్పడ్డ సంక్షోభం భవిష్యత్తులో ఏ తరహా పరిస్థితులకు దారితీస్తుందోన్న సంశయాలు సర్వత్రా నెలకొన్నాయి.