iDreamPost
android-app
ios-app

మోదీ జంబో కేబినెట్‌.. కొత్త మంత్రులు వీరే.. నితీష్‌కు నిరాశ..

మోదీ జంబో కేబినెట్‌.. కొత్త మంత్రులు వీరే.. నితీష్‌కు నిరాశ..

అంచనాలకు మించి కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరిగింది. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మోదీ తొలిసారి కేబినెట్‌ను ప్రక్షాళన చేశారు. 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికిన మోదీ.. కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈ రోజు మొత్తం 43 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రులుగా పని చేస్తున్నవారు ఉన్నారు. తాజా విస్తరణతో.. కేబినెట్‌లో మొత్తం మంత్రుల సంఖ్య 77కు చేరింది. నిబంధనల ప్రకారం ఇంకా మరో నలుగురుకు అవకాశం కల్పించేందుకు అవకాశం ఉంది.

వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్‌కు కేబినెట్‌లో మోదీ పెద్దపీట వేశారు. తెలుగురాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరికీ అవకాశం లభించలేదు. తెలంగాణకు చెందిన కిషన్‌ రెడ్డికి ప్రమోషన్‌ లభించింది. ప్రస్తుతం సహాయ మంత్రిగా పని చేస్తున్న ఆయనకు కేబినెట్‌ హోదా లభించింది. ఇంతకు మించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి విశేషం లేదు. ఎన్టీఏ భాగస్వామ్య పార్టీలలో లోక్‌జనశక్తి, అప్నాదల్‌ పార్టీలకు అవకాశం కల్పించారు. ఆ పార్టీల నుంచి ఒక్కొక్కరి చొప్పన స్థానం కల్పించారు. కేంద్ర కేబినెట్‌లో స్థానం ఆశించిన జేడీయూకు అవకాశం దక్కలేదు.

ప్రమాణం చేసింది వీరే..

1. నారాయణ రాణే, కొంకణ్‌ ఎంపీ, మహారాష్ట్ర, ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పని చేశారు.
2. సర్బానంద్‌ సోనోవాల్, అస్సాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.
3. వీరేంద్రకుమార్, తికమ్‌గడ్‌ ఎంపీ, మధ్యప్రదేశ్, ఏడు సార్లు ఎంపీగా పని చేశారు.
4. జ్యోతిరాధిత్య సింధియా, రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్‌.
5. రామచంద్ర ప్రసాద్‌ సింగ్, రాజ్యసభ సభ్యుడు, బిహార్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి.
6 అశ్వీని వైష్ణవ్, రాజ్యసభ సభ్యుడు, ఒడిశా, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి.
7. పశుపతి కుమార్‌ పారస్, బిహార్‌ (ఎల్‌జేపీ నేత), లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిహార్‌ మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు.
8. కిరణ్‌ రిజుజు, ఎంపీ, అరుణాచల్‌ ప్రదేశ్‌ వెస్ట్‌ నియోజకవర్గం, ప్రస్తుతం కేంద్ర కీడల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.
9. రాజ్‌కుమార్‌ సింగ్, అర్రా ఎంపీ, బిహార్, ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
10. హర్దీప్‌ సింగ్‌ పూరి, రాజ్యసభ సభ్యుడు, ఉత్తరప్రదేశ్‌.
11. మన్సుక్‌ మాండవ్య, రాజ్యసభ సభ్యుడు, గుజరాత్‌. ప్రస్తుతం పోర్ట్స్, నౌకాయాన సహాయ మంత్రి.
12. భూపేంద్ర యాదవ్, రాజ్యసభ సభ్యుడు, రాజస్థాన్‌.
13. పురుషోత్తం రూపాల, రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుతం వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు.
14. కిషన్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ ఎంపీ, తెలంగాణ, ప్రస్తుతం హోం శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు.
15. అనురాగ్‌ ఠాకూర్, హమీర్‌పూర్‌ ఎంపీ, హిమాచల్‌ ప్రదేశ్, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు.
16. పంకజ్‌ చౌదరి, మహారాజ్‌గంజ్‌ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌.
17. అనుప్రియ సింగ్‌ పటేల్, మిర్జాపూర్‌ ఎంపీ, ఉత్తర ప్రదేశ్, అప్నాదల్‌ పార్టీ, 2016–19 మ«ధ్య కేంద్ర మంత్రిగా పని చేశారు.
18. సత్యపాల్‌ సింగ్‌ బఘేల్, ఆగ్రా ఎంపీ, ఉత్తరప్రదేశ్‌.
19. రాజీవ్‌ చంద్రశేఖర్, కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుజరాత్‌.
20. శోభా కరంద్లాజే, ఉడిపి చిక్‌మంగుళూరు ఎంపీ, కర్ణాటక.
21. భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ, జలౌన్‌ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌.
22. దర్శన్‌ విక్రమ్‌ జర్దోష్, సూరత్‌ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌.
23. మీనాక్షి లేఖి, న్యూఢిల్లీ ఎంపీ, పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ స్థాయీ సంఘం సభ్యురాలుగా పని చేస్తున్నారు.
24. అన్నపూర్ణాదేవి యాదవ్, కొదర్మ ఎంపీ, జార్ఖండ్‌.
25. ఎ.నారాయణ స్వామి, చిత్రదుర్గ ఎంపీ, కర్ణాటక.
26. కౌశల్‌ కిషోర్, మోహన్‌లాల్‌ గంజ్‌ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌.
27. అజయ్‌ భట్, నైనిటాల్‌–ఉధమ్‌ సింగ్‌ నగర్‌ ఎంపీ, ఉత్తరాఖండ్‌.
28. బి.ఎల్‌.వర్మ, రాజ్యసభ సభ్యుడు, ఉత్తరప్రదేశ్‌.
29. అజయ్‌ కుమార్‌ మిశ్రా, ఖీరీ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌.
30. దేవ్‌సింహ్‌ చౌహాన్, ఖెడా ఎంపీ, గుజరాత్‌
31. భగవంత్‌ ఖూబా, బీదర్‌ ఎంపీ, కర్ణాటక.
32. కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్, బివాండి ఎంపీ, మహారాష్ట్ర.
33. ప్రతిమ భౌమిక్, త్రిపుర నార్త్‌ ఈస్ట్‌ ఎంపీ,
34. సుభాష్‌ సర్కార్, బన్‌కుర ఎంపీ, పశ్చిమబెంగాల్‌.
35. భగవత్‌ కిషన్‌రావు, మహారాష్ట్ర.
36. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్, ఎంపీ మణిపూర్‌.
37. భారతీ ప్రవీణ్, దిండోరి ఎంపీ, మహారాష్ట్ర.
38. బిశ్వేశ్వర్‌ తుడు, మయుర్బంజ్‌ ఎంపీ, ఒడిశా.
39. శంతనూ ఠాకూర్, బంగోన్‌ ఎంపీ, పశ్చిమ బెంగాల్‌.
40. ముంపపార మహేంద్రపాయి, సురేంద్రనగర్‌ ఎంపీ, గుజరాత్‌.
41. జాన్‌ బార్ల, లోక్‌సభ సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌.
42. ఎల్‌. మురుగన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు. ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కారు.
43. నిశిత్‌ ప్రమాణిక్, కోచ్‌ బెహర్‌ ఎంపీ, పశ్చిమ బెంగాల్‌.

Also Read : 11 మంది కేంద్ర మంత్రులపై వేటు