iDreamPost
android-app
ios-app

క్రేజీ OTT రిలీజులు వచ్చేస్తున్నాయి

  • Published Mar 17, 2021 | 5:21 AM Updated Updated Mar 17, 2021 | 5:21 AM
క్రేజీ OTT రిలీజులు వచ్చేస్తున్నాయి

ఎవరు ఎంత కాదన్నా వెండితెరకు చిన్నితెరకు మధ్య దూరం క్రమంగా తగ్గిపోతోంది. ఇది లాక్ డౌన్ వల్ల జరిగిందా లేక ఆదాయం కోసం నిర్మాతలు పడుతున్న తొందరపాటు వల్ల అవుతోందా అనేది పక్కనపెడితే ఈ పరిణామాలు మాత్రం ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తున్నాయి. మొన్న శివరాత్రికి విడుదలైన ‘గాలి సంపత్’ ఈ 19నే ఆహా యాప్ ద్వారా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు నిన్న అఫీషియల్ గా ప్రకటించారు. అనిల్ రావిపూడి, శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ లాంటి బ్రాండెడ్ టీమ్ ఉన్న సినిమాను ఇంత తక్కువ గ్యాప్ లో వేయడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంత డిజాస్టర్ అయినా ఇలా చేయడం ఏమిటనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

ఇక కమర్షియల్ గా మంచి విజయం అందుకున్న ‘జాంబీ రెడ్డి’ ఇదే ఆహా ద్వారా 26న రాబోతోంది. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ దీనికి గణనీయంగా ఉండటంతో వ్యూస్ విషయంలో మంచి రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఉప్పెన’ మార్చి 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో రావొచ్చని ఓటిటి వర్గాల సమాచారం. ఇప్పటికైతే అఫీషియల్ న్యూస్ రాలేదు కానీ మరికొద్ది గంటల్లో వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే వచ్చిన మరో చిన్న సినిమా ‘క్షణక్షణం’ కూడా ఆహాలో రాబోతోంది. ఇంకా రాబోతున్న చిత్రాల లిస్టు చాలా పెద్దదే ఉంది. ప్రైమ్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో సినిమా టాక్ పూర్తిగా తెలుసుకున్నాక అది ఓటిటిలో త్వరగా రాదని కన్ఫర్మ్ చేసుకున్నాకే జనం థియేటర్లకు వచ్చేలా కనిపిస్తోంది. జాతిరత్నాలు, క్రాక్ లాంటి యునానిమస్ హిట్ రిపోర్ట్స్ వచ్చిన వాటికి ఇబ్బందేమీ లేదు కానీ పైన చెప్పిన గాలి సంపత్ లాంటివి మాత్రం ఓపెనింగ్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇదంతా మార్పులో భాగం అనుకుని స్వాగతించాల్సింది తప్పించి ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. జాతిరత్నాలు స్ట్రీమింగ్ పార్టనర్ ప్రైమ్ అని తెలిసిపోవడంతో ఫ్యాన్స్ డేట్ ని ప్రకటించమని అభిమానులు కోరుతున్నారు.