iDreamPost
android-app
ios-app

2022 రివ్యూ 2 – కొత్త దర్శకుల హవా

  • Published Dec 22, 2022 | 4:57 PM Updated Updated Dec 22, 2022 | 4:57 PM
2022 రివ్యూ 2 – కొత్త దర్శకుల హవా

ఎన్నో హిట్లు ఫ్లాపులు కలగలిసిన సంతకాలు చేసి వెళ్తున్న 2022లో కొత్త దర్శకుల హవా ఎలా ఉందో చూద్దాం. మార్కెట్ పరంగా పట్టు తగ్గిపోయిన కళ్యాణ్ రామ్ ని బింబిసార లాంటి ఫాంటసీ డ్రామాలో చూపించి మెప్పించే ప్రయత్నంలో ‘వశిష్ట’ నూటికి నూరు మార్కులు తెచ్చుకునేలా చేసింది. బడ్జెట్ కంట్రోల్ లో పెడుతూనే మంచి క్వాలిటీతో తెరకెక్కించిన తీరు బయ్యర్లకు లాభాల వర్షం కురిపించింది. ఒక్క సినిమాతో సిద్దు జొన్నలగడ్డ లాంటి అప్ కమింగ్ హీరోకి విపరీతమైన డిమాండ్ వచ్చేలా చేయడంలో డీజే టిల్లు పాత్ర గురించి అందరికీ తెలిసిందే. తన బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుని ‘విమల్ కృష్ణ’ తీసిన ఈ కామెడీ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ కొట్టింది
radhika - dj tillu
ఇద్దరు ముగ్గురు పేరున్న సీనియర్ ఆర్టిస్టులు తప్ప అసలు ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేని మసూద అది కూడా దెయ్యాల కథతో సూపర్ హిట్ కొట్టడం ‘సాయి కిరణ్’ కే చెల్లింది. ట్రీట్మెంట్ లో చూపించిన వైవిధ్యం ప్రేక్షకులకు నచ్చేసింది. కేవలం సమంతా ఇమేజ్ ప్లస్ యాక్టింగ్ ని ఆధారంగా చేసుకుని దర్శక ద్వయం ‘హరి హరీష్’లు తీసిన యశోద బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలబడింది. జనానికి ఆల్రెడీ బోర్ కొట్టేసిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ‘శ్రీ కార్తీక్’ ఇచ్చిన ఒకే ఒక జీవితం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. హిట్టు కోసం మొహం వాచిపోయిన శర్వానంద్ కు కోరుకున్న విజయాన్ని అందించింది. ఓటిటిలోనూ దీనికి మిలియన్ల వ్యూస్ వచ్చాయి

కోలీవుడ్ నుంచి వచ్చిన ‘అశ్వత్ మరిముత్తు’ ఓరి దేవుడాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. రీమేక్ అయినప్పటికీ యూత్ కి ఓ మోస్తరుగా నచ్చేలా యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. బెల్లంకొండ గణేష్ ని పరిచయం చేసిన ‘లక్ష్మణ్ కృష్ణ’ స్వాతిముత్యంతో ప్రశంశలు అందుకున్నాడు. దారుణమైన ఫెయిల్యూర్స్ అందుకున్న వాళ్ళూ ఉన్నారు. రాజశేఖర్ (మాచర్ల నియోజకవర్గం), గిరిసాయ(రంగ రంగ వైభవంగా), శరత్ మండవ(రామారావు ఆన్ డ్యూటీ), కిరణ్ కొర్రపాటి(గని), శాంటో(స్టాండ్ అప్ రాహుల్), గోపినాధ్ రెడ్డి(సమ్మతమే), బాలాజీ(సెబాస్టియన్), ప్రదీప్ వర్మ(అల్లూరి), సతీష్ త్రిపుర(దొంగలున్నారు జాగ్రత్త) వీళ్లంతా మొదటి అడుగులోనే జారిపడిన వాళ్ళు.