iDreamPost
android-app
ios-app

కుక్కలకు ఆధార కార్డులు ఇస్తున్నారు.. ఎక్కడంటే!

కుక్కలకు  ఆధార  కార్డులు ఇస్తున్నారు.. ఎక్కడంటే!

ఆధార్ కార్డు.. భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని కార్డు. కారణం..నేడు ప్రతి ఒక్క పనికి ఆధార్ తప్పనిసరిగా మారింది.  ఈ కార్డు అనేది మనుషలు గుర్తింపు కోసం కేంద్రం తెచ్చిన యూనిక్  నంబర్. అలానే దేశం అక్రమంగా చొరపబడిన వారి నివారణకు కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. పుట్టిన బాబు నుంచి పండు ముసలి వారి వరకు అందరికి ఆధార్ కార్డు అనేది తప్పని సరి. అయితే తాజాగా కుక్కలకు కూడా ఆధార్ కార్డు తయారు చేస్తున్నారు. వాటి కూడా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు.  కుక్కలకు ఆధార్ కార్డు అనేది ఎక్కడ కాదు.. మన దేశంలోని ఆర్ధిక రాజధాని ముంబై నగరంలోనే ఇవ్వనున్నారు. మరి. కుక్కలకు ఆధార్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని ముంబై విమానాశ్రయం పరిసరాల్లో తిరుగుతున్న వీధి కుక్కల మెడలో ఆధార్ మాదిరిగా ఉండే కార్డులు వేశారు. ఆధార్ కార్డులో మనుషుల వివరాలను , బయోడేటాను అడ్రెస్, ఇతర వివరాలు ఎలాగైతే ఎంటర్ చేస్తారో, అదే విధంగా వీధి కుక్కల వివరాలతో డిజిటల్ క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులను వాటికి వేశారు. ఈ కార్డును ముంబైకే చెందిన ఇంజినీర్ అక్షన్ రిడ్లాన్ తయారు చేశారు.  కుక్కకు తగిలించిన కార్డులో..దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ కుక్కలు ఉండే ప్రాంతం  వివరాలు, వయసు, సంతానం కలుగకుండా స్టెరిలైజేషన్ చేశారా? లేదా?. టీకాలు వేసిన వివరాలు,కుక్కు తప్పిపోయినప్పుడు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు వంటివి ఈ కార్డులో నమోదై ఉంటాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఒక క్యూఆర్ కోడ్ గా మార్చారు.  ఈ క్యూఆర్ కోడ్ పై స్కాన్ చేస్తే కుక్కుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

ముంబై నగరలోని వీధి కుక్కులను  ట్రాక్ చేసేలా త్వరలో లొకేషన్ ఆప్షన్ కూడా ఈ ఐడీ కార్డులకు జతపరుస్తామని అక్షయ రిడ్లాన్ తెలిపారు. pawfriend.in పేరుతో తాను నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌లో తాము ఐడీ కార్డుల ఇష్యూ చేసిన వీధి కుక్కలకు.. అందులో వాటి వివరాలు పొందుపరిచామని పేర్కొన్నారు. ఈ ఐడీ కార్డులు వేసే క్రమంలోనే ఆ 20 కుక్కలకు టీకాలు కూడా వేయించామని ఆయన తెలిపారు. ముంబైలోని బాంద్రా వాసి సోనియా షెలార్ అనే మహిళ  ప్రతి రోజు దాదాపు 300 వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్నారు. మరి.. కుక్కలకు ఆధార్ కార్డును తయారు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: వందే భారత్ రైల్లో మంటలు.. ప్రయాణికలు అలర్ట్!