iDreamPost

వీడియో: వందే భారత్ రైల్లో మంటలు.. ప్రయాణికలు అలర్ట్!

వీడియో: వందే భారత్ రైల్లో మంటలు.. ప్రయాణికలు అలర్ట్!

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా వందే భారత్ రైల్లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ రైల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని సీ-14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి.  అకస్మాత్తుగా మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో రైలులో నుంచి బయటకు పరుగులు తీశారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని రాణికమాలపాటి స్టేషన్ నుంచి వందే భారత్ రైలు  ప్రయాణం మొదలైంది. ఆ తరువాత కుర్వాయి స్టేషన్ వద్దకు చేరుకునే సరికి రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో రైలుకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకో పైలట్ కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక  సిబ్బంది మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చున్నారు. ఈ  ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరితం సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండిచెత్తకు ఇంధన పథకం.. పెట్రోల్ ధరలపై భారీ తగ్గింపు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి