15 మందితో రామ్ మందిర్ ట్రస్ట్ – దళితుడికి చోటు

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టులో ఓ దళితుడికి కూడా చోటు కల్పించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించేందుకు ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించిన నేపథ్యంలో అమిత్ షా స్పందిస్తూ మొత్తం 15 మందితో ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

‘‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో మొత్తం 15 మంది ట్రస్టీలు ఉంటారు. అందులో దళిత వర్గానికి చెందిన ఒకరికి ప్రాతినిధ్యం ఉంటుంది. సామాజిక సామరస్యాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు ప్రధాని మోదికి కృతజ్ఞతలు…’’ అని అమిత్ షా పేర్కొన్నారు. మొత్తం 67 ఎకరాల స్థలాన్ని ఆలయ ట్రస్టుకు ఇస్తామనీ.. ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ట్రస్టు సభ్యులే తీసుకునేలా ట్రస్ట్ కు స్వేచ్ఛ ఉంటుందన్నారు.

Show comments