iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్ కృషి భేష్ : ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్లు.. ఆధునిక ల్యాబ్ లు

జ‌గ‌న్ కృషి భేష్ : ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్లు.. ఆధునిక ల్యాబ్ లు

కరోనా మహమ్మారి కాలంలో క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో అప్పుడు, ఇప్పుడు కూడా దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఆరోగ్యం విష‌యంలో జ‌గ‌న్ ఖ‌ర్చుకు ఎక్క‌డా వెనుకాడ‌డం లేదు. ప‌రీక్ష‌లు, ఏర్పాట్ల విష‌యంలో అందరికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌ కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ ఆందోళనలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

అలాగే.. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం (జనవరి 9) కొత్తగా 1,257 మంది వైరస్‌ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 38, 479శాంపిల్స్ పరీక్షించారు. కాగా వైరస్ బారిన పడి.. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా.. మరో 140 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 4774 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 254 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖలో 196, అనంతపురంలో 138, కృష్ణాలో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటి దాకా 3,16,05,951 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మొత్తం 20,78, 964 మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా 20, 59, 685 మంది వైరస్‌ను జయించారు. మొత్తం 14505 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఆక్సిజన్‌ ప్లాంట్లు నేడు ప్రారంభం

ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం జరగనుంది. రూ. 426 కోట్ల వ్యయంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందుకుగానూ, రూ. 20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ కంటైనర్లను కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సౌకర్యం కల్పిస్తారు. మొత్తం 39 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకు 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ వైరల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి. క‌రోనా ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

Also Read : థర్ట్‌ వేవ్‌ మొదలైంది.. భారత్‌ సిద్ధమైందా..?