Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని దూషించిన కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి సీఎం వైఎస్ జగన్‌ను దూషించడంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని దూషించి, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి కారణం అయ్యారనే అభియోగాలపై పోలీసులు పట్టాభిపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి పట్టాభిని ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ రోజు ఉదయం పట్టాభికి విజయవాడలో కోవిడ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహింపజేసిన పోలీసులు.. విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. అదే సమయంలో పట్టాభి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలను విన్న న్యాయమూర్తి పట్టాభిరామ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. న్యాయమూర్తి తీర్పు అనంతరం పోలీసులు పట్టాభిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. నవంబర్ 4వ తేదీ వరకు పట్టాభి రిమాండ్ కొనసాగనుంది.
Also Read : TDP Pathabhi -వివాదాస్పద టీడీపీ నేత పట్టాభి అరెస్ట్..