Idream media
Idream media
ఓ రౌడీ షీటర్ విశృలంక ప్రవర్తన వల్ల ఆపదలో ఉన్న వారిని కాపాడే 108 దగ్ధమైంది. తనను కాపాడేందుకు వచ్చిన 108 వాహనాన్ని ఆ రౌడీ షీటరే తగులబెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ రోజు జరిగింది. ఒంగోలుకు చెందిన నేలపాటి సురేష్ ఇటీవల పలుమార్లు 100 కాల్ చేసి పోలీసులను ఇబ్బందులకు గురిచేశాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఒంగోలు తాలూకా స్టేషన్‌కు వచ్చిన తనను అరెస్ట్ చేయాలంటూ హడావుడి చేశాడు. స్టేషన్ గ్లాస్ తలుపులను పగులగొట్టాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి.
రౌడీ షీటర్ సురేష్‌కు గాయాలు కావడంతో పోలీసులు 108కు ఫోన్ చేశారు. ఆస్పత్రికి తరలించేందుకు అతన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అయితే వాహనం అద్దాలు పగులగొట్టిన సురేష్.. అందులో ఉన్న స్పిరిట్‌ను అంబులెన్స్‌లో చల్లి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో రౌడీ షీటర్ నేలపాటి సురేష్ ఒంగోలులో హల్‌చల్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు అతన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తుండడంతో తమను విసిగించేందుకు యత్నిస్తున్నాడని పేర్కొంటున్నారు.