iDreamPost

ప్యాకెట్ లో ఒక్క బిస్కెట్ తగ్గినందుకు.. కంపెనీకి లక్ష జరిమానా!

దేశ వ్యాప్తంగా అనేక రకాల సూపర్ మార్కెట్ లు అందుబాటులో ఉన్నాయి. తమ తమ ఉత్పత్తుల సేల్ పెంచుకోవడం కోసం రకరకాల ఆఫర్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. అయితే ఇటీవల పలు సూపర్ మార్కెట్ లు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా అనేక రకాల సూపర్ మార్కెట్ లు అందుబాటులో ఉన్నాయి. తమ తమ ఉత్పత్తుల సేల్ పెంచుకోవడం కోసం రకరకాల ఆఫర్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. అయితే ఇటీవల పలు సూపర్ మార్కెట్ లు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

ప్యాకెట్ లో ఒక్క బిస్కెట్ తగ్గినందుకు.. కంపెనీకి లక్ష జరిమానా!

మనకు నిత్యావసర వస్తువులు కావాలంటే సాధారణంగా సూపర్ మార్కెట్ లను సందర్శిస్తుంటాము. దేశ వ్యాప్తంగా అనేక రకాల సూపర్ మార్కెట్ లు అందుబాటులో ఉన్నాయి. తమ తమ ఉత్పత్తుల సేల్ పెంచుకోవడం కోసం రకరకాల ఆఫర్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. అయితే ఇటీవల పలు సూపర్ మార్కెట్ లు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. క్వాలిటీ, క్వాంటిటీ, ధరల విషయంలో కస్టమర్లను బురిడీ కొడుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మోసాలను గ్రహించిన కొందరు కస్టమర్లు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి పరిహారాన్ని పొందుతున్నారు. ఇదే రీతిలో ఓ కస్టమర్ తను కొనుగోలు చేసినటువంటి బిస్కెట్ ప్యాకెట్ లో ఒక్క బిస్కెట్ తగ్గినందుకు కంపెనీ నుంచి లక్ష రూపాయల పరిహారం పొందాడు. ఆ వివరాలు మీకోసం..

చెన్నైకి చెందిన ఢిల్లీ బాబు అనే వ్యక్తి తన పెంపుడు కుక్కల కోసం బిస్కెట్లను కొనేందుకు ఎఫ్ ఎంసీజీ మేజర్ ఐటీసీ స్టోర్ కు వెళ్లాడు. అక్కడ సన్ ఫీస్ట్ మేరీ లైట్ బిస్కట్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఆ బిస్కెట్ ప్యాకెట్లో వాస్తవానికి 16 బిస్కెట్లు ఉండాలి. కానీ 16కు బదులు 15 మాత్రమే ఆ ప్యాకెట్లో ఉన్నాయి. దీంతో ఢిల్లీ బాబు ప్యాకెట్ లో బిస్కెట్ తగ్గడంపై అసహనానికి గురై ఐటీసీ స్టోర్ కు వెళ్లి సిబ్బందిని నిలదీశాడు. కానీ వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో ఢిల్లీ బాబు కన్యూమర్ కోర్టును ఆశ్రయించాడు.

తన ఫిర్యాదులో ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తుందని.. ఒక్కో బిస్కెట్ విలువ 75 పైసలు ఉంటుందని.. ఇలా ప్రతి ప్యాకెట్ లో ఒక్క బిస్కెట్ తక్కువగా ప్యాక్ చేసి లక్షల్లో మోసానికి పాల్పడుతుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన కన్స్యూమర్ కోర్టు ఢిల్లీ బాబుకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఐటీసీ కంపెనీని ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి