iDreamPost
iDreamPost
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత సాంప్రదాయాలను పక్కన పెడుతూ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. టిడిపి పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న సరే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న ధీమా గా ఉన్న చంద్రబాబు నాయుడు గెలుపు గుర్రాలుగా భావించే వారిని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే టిడిపికి ఏ మాత్రం అవకాశం లేని నియోజకవర్గాల మీద కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది.
సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం మీద కూడా చంద్రబాబు దృష్టి పెట్టడం గమనార్హం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన సతీష్ రెడ్డి వైసీపీ లోకి వెళ్లడంతో అక్కడ ఎమ్మెల్సీ గా పనిచేస్తున్న బీటెక్ రవి నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. అయితే వై సీ పీ అత్యంత బలమైన నియోజకవర్గంలో ఉన్న పులివెందులలో టిడిపి గెలవడం సాధ్యం కాకపోయినా సరే చంద్రబాబు నాయుడు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల ఇన్చార్జిగా పనిచేస్తున్న బీటెక్ రవిని వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండగానే పులివెందుల లాంటి నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించడం కాస్త టీడీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. నియోజకవర్గం వైసీపీ కి ప్రధానంగా వైఎస్ కుటుంబానికి అత్యంత బలమైన ప్రాంతంగా ఉంది. టీడీపీ బలంగా ఉన్న సమయంలో కూడా ఇక్కడ వైఎస్ కుటుంబాన్ని అడ్డుకోలేకపోయింది అనే చెప్పాలి.
అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీరియస్గా దృష్టి సారించడం నియోజకవర్గ పరిధిలో తెలుసుకోవడం అనూహ్యంగా అభ్యర్థిని ప్రకటించడం పట్ల కాస్త అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయడానికి ఎందరో నాయకుల ప్రయత్నం చేస్తున్నా సరే చంద్రబాబు నాయుడు తనకు సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే సీట్లు ఇవ్వడం నియోజకవర్గంలో కనీస పోటీని కూడా ప్రదర్శించ లేక పోవడం జరుగుతూనే వస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది ఏంటి అనేది చూడాలి. ఇక టిడిపి సీనియర్ నాయకులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు పార్టీలో పదవులు అనుభవించిన వారికి మాత్రమే ఇక్కడ అవకాశం కల్పించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.