ఫోన్‌పేలో లోపం ఉంది.. ఎవరైనా హ్యాక్ చేయచ్చు.. బయటపెట్టిన యువకుడు

Bug In PhonePe: ఫోన్ పే వాడుతున్నారా? అయితే ఫోన్ పేలో లోపం ఉందని మీకు తెలుసా? ఓటీపీ ద్వారా ఫోన్ పేలో లాగిన్ అవుతున్నారా? అయితే మీకు తెలుసా? మీ ఫోన్ పే అకౌంట్ ని ఎవరైనా హ్యాక్ చేయవచ్చు. ఈ విషయాన్ని ఒక యువకుడు వెల్లడించాడు.

Bug In PhonePe: ఫోన్ పే వాడుతున్నారా? అయితే ఫోన్ పేలో లోపం ఉందని మీకు తెలుసా? ఓటీపీ ద్వారా ఫోన్ పేలో లాగిన్ అవుతున్నారా? అయితే మీకు తెలుసా? మీ ఫోన్ పే అకౌంట్ ని ఎవరైనా హ్యాక్ చేయవచ్చు. ఈ విషయాన్ని ఒక యువకుడు వెల్లడించాడు.

సాధారణంగా సాఫ్ట్ వేర్స్ లోనూ, యాప్స్ లోనూ బగ్స్ అనేవి బయపడుతుంటాయి. వీటిని డెవలపర్స్ ఎప్పటికప్పుడు గుర్తించి సాల్వ్ చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో హ్యాకర్స్ కొన్ని యాప్స్ లేదా వెబ్ సైట్స్ ని హ్యాక్ చేసి పొంచి ఉన్న ముప్పును ముందుగానే తెలియజేస్తారు. వీళ్ళనే ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఎథికల్ హ్యాకర్స్ అంటే హ్యాకర్ల కంటే వేగంగా, ముందుగా ఆలోచించి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ని బ్రేక్ చేసి అసలు హ్యాక్ అవ్వకుండా చేయడమే. తాజాగా అలాంటి ఎథికల్ హ్యాకర్ ఒకరు మన దేశంలో ఉన్నారు. గూగుల్, నాసాకు చెందిన డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందన్న సమాచారాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఫోన్ పేలో బగ్ ఉందని ఆ యువకుడు గుర్తించాడు.  

బీహార్ లోని భాగల్ పూర్ కి చెందిన మయాంక్ అనే యువకుడు ఫోన్ పేలో లోపాన్ని గుర్తించాడు. ఇతను సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడిగా పని చేస్తున్నాడు. రీసెంట్ గా ఓటీపీ లేకుండా ఫోన్ పేలో లాగిన్ అయ్యాడు. అయితే అందులో బగ్ ఉందని గుర్తించి ఫోన్ పే కంపెనీకి తెలియజేశాడు. దీంతో కంపెనీ ఈమెయిల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసింది. అంతేకాదు మయాంక్ పేరుని హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చింది. మరికొద్ది రోజుల్లో మయాంక్ ను సన్మానించనున్నట్లు ఫోన్ పే కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మయాంక్ మాట్లాడుతూ.. తాను ఫోన్ పేలో చాలా మందికి డబ్బులు పంపిస్తా ఉంటానని.. ఈ క్రమంలో ఎవరైనా ఫోన్ పే యాప్ ని హ్యాక్ చేయగలరా అన్న సందేహం వచ్చిందని అన్నాడు. ఆ తర్వాత ఫోన్ పే యాప్ ని హ్యాక్ చేయడంపై పరిశోధన చేశానని.. తన ఫోన్ లో ఓటీపీ సెక్షన్ ని తొలగించానని వెల్లడించాడు. ఓటీపీ లేకుండానే ఫోన్ పే యాప్ లో లాగిన్ అయ్యానని మయాంక్ తెలిపాడు.

ఓటీపీ లేకుండా లాగిన్ అయ్యేట్లు ఉంటే సులువుగా ఎవరైనా ఫోన్ పే యాప్ ని హ్యాక్ చేస్తారని మయాంక్ వెల్లడించాడు. అందుకే ఈ విషయాన్ని అర్జెంట్ గా ఫోన్ పే సంస్థకు తెలియజేశానని చెప్పుకొచ్చాడు. గతంలో కూడా పలు కంపెనీలకు సంబంధించి బగ్స్ గుర్తించాడు. నాసా, గూగుల్ సంస్థలకు బగ్స్ గురించి సమాచారం అందించాడు. 2023లో గూగుల్ లో లోపం ఉందని ఆ సంస్థకు తెలియజేశాడు. మయాంక్ చేసిన పనికి గూగుల్ అతనికి ఐఫోన్, ల్యాప్ టాప్ సహా పలు బహుమతులను అందించింది. నాసాలో పని చేస్తున్న వ్యక్తుల డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని నాసా వెబ్ సైట్ ని పరిశీలించడం ద్వారా తెలుసుకున్నాడు. దీంతో అతను నాసాకు ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మయాంక్ కళింగ యూనివర్సిటీలో బీసీఏ చదువుతున్నాడు. ఎథికల్ హ్యాకింగ్ లో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. 

Show comments