Uppula Naresh
తాజాగా ఓ యువకుడు జిమ్ సెంటర్ గుండెపోటుతో మరణించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో వైరల్ గా మారుతోంది.
తాజాగా ఓ యువకుడు జిమ్ సెంటర్ గుండెపోటుతో మరణించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో వైరల్ గా మారుతోంది.
Uppula Naresh
ఈ మధ్యకాలంలో చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. వయసులో తేడా లేకుండా ఇటు చిన్న పిల్లల నుంచి ఇటు మధ్య వయసు వాళ్ల వరకు అందరూ హార్ట్ ఎటాక్ తో పిట్లల్లా రాలుతున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి గుండెపోటు మరణాలు రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇవి మరువక ముందే ఇలాంటి ఘటనే మరొక చోట చేసుకుంది. ఓ యువకుడు జిమ్ సెంటర్ లో గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ దృశ్యాలన్నీ జిమ్ సెంటర్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ పరిధిలోని ఓ ప్రాంతంలో దుర్గేష్ శ్రీవాస్తవ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నాడు. అయితే, ఆరోగ్యంగా ఉండేందుకు ఇతడు రోజూ జిమ్ కు వెళ్లేవాడు. ఇక ఎప్పటిలాగే మంగళవారం కూడా దుర్గేష్ జిమ్ కు వెళ్లాడు. తనంతట తాను వ్యాయమాలు చేస్తూ ఉన్నాడు. కానీ, ఎందుకో అతడికి గుండెలో నొప్పి పుట్టినట్లుగా అనిపించింది. దీంతో అతడికి ఏం చేయాలో తెలియక అక్కడే ఓ చోట కూర్చున్నాడు. ఇక చూస్తుండగానే అతడు కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన జిమ్ లో ఉన్న కొందరు యువకులు అతడిని లేపే ప్రయత్నం చేశారు. కానీ, అతడు అస్సలు స్పందలేదు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు.. అతడు అప్పటికే గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు. ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ వార్త తెలుసుని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఉన్నట్టుండి దుర్గేష్ శ్రీవాస్తవ గుండెపోటుతో మరణించడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. ఇంతే కాకుండా ఈ వరుస గుండెపోటు మరణాలతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే, దుర్గేష్ శ్రీవాస్తవ జిమ్ సెంటర్ లో హార్ట్ ఎటాక్ తో కుప్పకూలి పడిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వరుస గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) December 6, 2023