iDreamPost
android-app
ios-app

పెళ్లి బారాత్ లో డ్యాన్స్.. చూస్తుండగానే హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయాడు

  • Published Nov 14, 2024 | 4:34 PM Updated Updated Nov 14, 2024 | 4:34 PM

Dance in the Wedding Baraat: ఈ మధ్య కాలంలో కొంతమంది పెళ్లి బారాత్ లో విపరీతంగా డ్యాన్స్ చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. డ్యాన్స్ చేస్తూ ఉన్నట్లు కుప్పకూలిపోవడం.. క్షణాల్లో కన్నుమూయడం జరుగుతుంది.

Dance in the Wedding Baraat: ఈ మధ్య కాలంలో కొంతమంది పెళ్లి బారాత్ లో విపరీతంగా డ్యాన్స్ చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. డ్యాన్స్ చేస్తూ ఉన్నట్లు కుప్పకూలిపోవడం.. క్షణాల్లో కన్నుమూయడం జరుగుతుంది.

పెళ్లి బారాత్ లో డ్యాన్స్.. చూస్తుండగానే హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయాడు

ఈ మధ్య దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించేవారు.. ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పెళ్లి బారాత్ లో ఓ యువకుడు ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు హ్యాపీగా అందరితో కలిసి డ్యాన్స్ చేసిన నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జిగిత్యాల్ జిల్లా మేడిపల్లి మండలం మోత్కూరావుపేట.. కమ్మరిపేట గ్రామానికి చెందిన సంజీవ్ (23) తన మేనమామ కుమారుడు పెళ్లికి వచ్చాడు. వరుసకు బావాబామ్మర్థులు కావడంతో చిన్నప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితుల్లా ఉండేవారు.. వారి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే పెళ్లికి వారం ముందు మామయ్య ఇంటికి వచ్చి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు సంజీవ్. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పెళ్లి బారాత్ వేడుకలో బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేశాడు. ఉన్నట్టుండి రోడ్డుపై సంజీవ్ కుప్పకూలిపోయాడు.. ఆ తర్వాత ఉలుకు పలుకు లేకపోవడంతో వెంటనే బంధువులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సంజీవ్ ని పరీక్షించిన డాక్టర్లు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్దారించారు. దీంతో ఎంతో సంతోషంగా ఉన్న పెళ్లి వేడుకల్లో తీవ్ర విషాదం నిండుకుంది. మంచి చదువు, ఎలాంటి దురలవాట్లు లేవు.. చలాకీగా ఆరోగ్యంగా ఉండే సంజీవ్ నిర్జీవంగా విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంజీవ్ మృతితో కమ్మరిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఒకప్పుడు మ్యూజిక్‌, మేళతాలాలు, నృత్యాలతో కోలాహలంతో బారాత్‌ తీసేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.. పెళ్లి బారాత్ అంటే చెవులు చిల్లులు పడేలా డీజేలు, పూనకం వచ్చినట్లు ఊగిపోయే స్టెప్పులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా డ్యాన్స్ చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయి అక్కడిక్కడే కుప్పకూలిపోతున్నారు. పెళ్లి బారాత్ పాల్గొనే ముందు సింపుల్‌గా కనిపించినా.. కాస్త మందు చుక్క పడగానే పూనకాలు వచ్చిన వారిలా రెచ్చిపోతుంటారు. వయసుతో సంబంధం లేకుండా అలసిపోయే వరకు డ్యాన్స్ చేస్తుంటారు. అయితే గుండెపోటు ఉన్నవారు, నరాల బలహీనత,ఆస్తమా లాంటి వాటితో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రిస్క్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం కలగొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, వైద్యుల హెచ్చరికలు పాలటించకుండా పెళ్లి బారాత్ లో మితిమించి డ్యాన్స్ చేయడం.. ప్రాణాల మీదకు తెచ్చుకోవం ఈ మధ్య సర్వసాధారణం అవుతుందని వైద్యులు అంటున్నారు.

ఇదిలా ఉంటే..ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద వయసు వాళ్లకే హార్ట్ ఎటాక్ వస్తుందని అనేవారు. కానీ ఈ మధ్య చిన్న పిల్లలు, యుక్త వయసు వారికి హార్ట్ ఎటాక్ రావడంతో ఉన్నచోటే కుప్పకూలి పోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కంటికి కనిపించని లోకాలకు వెళ్తున్నారు. చాలా వరకు అధిక వ్యాయామం, పని ఒత్తిడి, ఎక్కువగా డ్యాన్స్ చేయడం, అనారోగ్య కారణాల వల్ల గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు.