iDreamPost
android-app
ios-app

వీడియో: అందరి ముందే MLA చెంప పగుల గొట్టిన మహిళ!

  • Published Jul 13, 2023 | 8:20 AM Updated Updated Jul 13, 2023 | 8:20 AM
  • Published Jul 13, 2023 | 8:20 AMUpdated Jul 13, 2023 | 8:20 AM
వీడియో: అందరి ముందే MLA చెంప పగుల గొట్టిన మహిళ!

ఉత్తర భారత దేశంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రజలు నిరాశ్రయులుగా మారిపోయారు. ఇంకొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి.. తినడానికి తిండిలేని పరిస్థితుల్లోకి ప్రజలు చేరుకున్నారు. ఇక, హర్యానాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి సకాలంలో సహాయం అందకపోవటంతో తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.

ప్రజా ప్రతినిధులపై మండిపడుతున్నారు. తాజాగా, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళ.. పరామర్శించటానికి వచ్చిన ఎమ్మెల్యేపై దాడి చేసింది. అందరి ముందు అతడి చెంప పగులగొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని కైతాల్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌.. జిల్లాలోని గుహ్ల ఏరియా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శిస్తూ ఉన్నారు.

ఓ చోట ఎమ్మెల్యేను కొంతమంది ప్రజలు అడ్డుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా వరదలు వస్తున్నాయంటూ వారు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దానికి తోడు ఎమ్మెల్యే ఆలస్యంగా తమ ప్రాంతానికి వచ్చాడని మండిపడ్డారు. ఓ మహిళ అందరి ముందు ఏకంగా ఎమ్మెల్యేపై చెయ్యి కూడా చేసుకుంది. అతడి చెంప చెళ్లుమనిపించింది. ఆ వెంటనే ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బందితో పాటు అక్కడి వారు ఆమెను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetstake girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio