Venkateswarlu
Venkateswarlu
ఎగ్జిబిషన్‌లో చిన్న పాటి విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ రంగుల రాట్నం ఎక్కి తిరుగుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె జుట్టు రంగుల రాట్నంలోని ఓ భాగంలో పడి ఇరుక్కుంది. ఎంతో కష్టం మీద జట్టును కత్తిరించి మరీ ఆమెను కాపాడారు. కొంచెం అటు, ఇటు అయినా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ సంఘటన గుజరాత్‌లో ఆసల్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లోని ఓ ప్రాంతంలో శ్రీ శ్రీరామ్ మెలో కార్నివాల్ జరిగింది.
ఈ కార్నివాల్‌కు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ రంగుల రాట్నం ఎక్కింది. రంగుల రాట్నం గాల్లో తిరుగుతూ ఉండగా.. మహిళ జుట్టు రంగుల రాట్నంలోని ఓ భాగంలో ఇరుక్కుపోయింది. జుట్టు ఇరుక్కుపోవటంతో ఆమె పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టింది. దీంతో రంగుల రాట్నం సిబ్బంది దాన్ని ఆపేశారు. ఆ వెంటనే కొంతమంది ఆమె జుట్టును రంగుల రాట్నంలోంచి బయటకు తీసే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే, జుట్టు గట్టిగా ఇరుక్కుపోవటంతో బయటకు తీసుకురావటం కుదర్లేదు.
చేసేదేమీ లేక జుట్టును కత్తిరించారు. ఆమె సురక్షితంగా బయటపడింది. కొంచెం అటు,ఇటు అయినా ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. రంగుల రాట్నం కారణంగా ప్రమాదానికి గురై చాలా మంది చనిపోయారని, ఆమె అదృష్టం కొద్ది బతికిందని కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.