ఎన్నికల వేళ పట్టుబడిన నగదు, మద్యాన్ని ఏం చేస్తారంటే..

Elections 2024: ఎన్నికల వేళ భారీ ఎత్తున్న నగదు, మద్యం పట్టుబడుతుంది. మరి అలా స్వాధీనం చేసుకున్న మద్యాన్ని, నగదును ఏం చేస్తారంటే..

Elections 2024: ఎన్నికల వేళ భారీ ఎత్తున్న నగదు, మద్యం పట్టుబడుతుంది. మరి అలా స్వాధీనం చేసుకున్న మద్యాన్ని, నగదును ఏం చేస్తారంటే..

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. దాంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం, మద్యం పంపకాన్ని అరికట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనేక చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఎక్కడికక్కడ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేపడుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో భారీ ఎత్తున నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి. మరి ఇలా పట్టుబడిన నగదు, మద్యాన్ని ఏం చేస్తారు.. ఎక్కడకు తరలిస్తారు అంటే..

లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 7 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం మార్చి 1 వరకు పట్టుబడిన నల్లధనం వివరాలను విడుదల చేసింది. ఇందులో రోజుకు సుమారు రూ. 100 కోట్ల మేర నగదు పట్టుబడింది అన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు అధికారులు మొత్తం రూ. 4650 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇలా పట్టుబడిన మొత్తం రూ.3475 కోట్లు కాగా ఈ సారి అంతకంటే ఎక్కువే పట్టుబడటం గమనార్హం.

పట్టుబడిన డబ్బును ఏం చేస్తారంటే..

ఎన్నికల వేళ 10 లక్షలకు పైగా నగదు పట్టుబడితే జిల్లా ట్రెజరీలో జమ చేయాలని చట్టం చెబుతోంది. ఒకవేళ రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదు పట్టుబడితే ఆదాయపు పన్ను నోడల్ అధికారికి కూడా తెలియజేయాలి. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బును ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి ఆ నగదు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది. నగదు రికవరీ అయిన వ్యక్తి దానిని క్లైయిమ్ చేసుకోవచ్చు.

ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందనే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు చెప్పి.. తగిన పత్రాలను చూపించాలి. మీరు చెప్పిన వివరాలను అధికారులు నమ్మకపోతే ఆ నగదును వారే స్వాధీనం చేసుకుంటారు. సరైన పత్రాలు చూపించాకే మీ నగదు మీకు తిరిగి అప్పగిస్తారు. అంతవరకు ఆ సొమ్ము కోర్టు కస్టడీలో ఉంటుంది. అయితే ఎవరూ డబ్బును క్లెయిమ్ చేయకపోతే అది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది.

మద్యాన్ని ఏం చేస్తారంటే..

ఎన్నికల వేళ సీజ్ చేసే మద్యాన్ని ఎక్సైజ్ శాఖకు అప్పగిస్తారు. ఇలా పట్టుబడిన మద్యాన్నిఅమ్మడానికి వీల్లేదు. ఈ మద్యం బాటిళ్లపై రోడ్ రోలర్ లేదా బుల్ డోజర్ వినియోగించి.. నాశనం చేస్తారు. లేదంటే గోతిలో పాతి పెడతారు.

Show comments