ఆ గ్రామంలో మహిళలు ఐదు రోజులు నగ్నంగా ఉంటారు.. ఎందుకో తెలుసా?

Strange Tradition in Pini Village: ఓక గ్రామంలో మహిళలు ఐదు రోజుల పాటు బట్టలు వేసుకోరు.. ఈ ఆచారం ఎక్కడో కాదు భారత దేశంలోనే ఉంది. ఆనాధిగా ఈ ఆచారం కొనసాగిస్తూ వస్తున్నారు.

Strange Tradition in Pini Village: ఓక గ్రామంలో మహిళలు ఐదు రోజుల పాటు బట్టలు వేసుకోరు.. ఈ ఆచారం ఎక్కడో కాదు భారత దేశంలోనే ఉంది. ఆనాధిగా ఈ ఆచారం కొనసాగిస్తూ వస్తున్నారు.

భారత దేశం భిన్న సంప్రదాయాలు, సంస్కృతుల కలయిక. దేశంలో ఎన్నో రకాల కులాలు, మతాల వారు నివసిస్తున్నారు.  కొన్ని ప్రాంతాల్లో నివసించే వారి సంప్రదాయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. నగరాలు, పట్టణాల్లో నివసించేవారికి ఇవి చాలా వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి.  పలు ప్రాంతాల్లో అనాధిగా వస్తున్న ఆచారాలు  ఇప్పటికీ పాటిస్తూనే ఉంటారు. అలాంటి ఓ వింత ఆచారం గురించి తెలుసుకుందాం. ఓ గ్రామంలో మహిళలు ఐదు రోజుల పాటు ఎలాంటి బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు. అలా అని అశ్లీల కోణంలో చూడాల్సి అవసరం లేదు.. ఎందుకంటే దీని వెనుక ఓ గొప్ప కథ ఉంది. మరి ఈ గ్రామం ఎక్కడుంది? ఎందుకు మహిళలు అలా చేస్తారు అన్న విషయం గురించి తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాలు, ఆ కాలం నాటి సంప్రదాయాలు పాటిస్తూనే ఉన్నారు. భారత దేశంలో ఓ రాష్ట్రంలో ఉన్న గ్రామంలో మహిళలు ఐదు రోజుల పాటు ఎలాంటి బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు. అది కూడా వారి ఇష్టపూర్వకంగానే.. ఇందులో ఎవరి బలవంతం ఉండదు. వివరాల్లోకి వెళితే.. హిమాచల్‌ప్రదేశ్‌లోని మణికరన్ లోయలో ఉన్న కుల్లు జిల్లాలో పినీ అనే గ్రామంలో ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. ఐదు రోజుల పాటు మహిళలు ఎలాంటి దుస్తులు ధరించరు.. భర్తలకు దూరంగా ఉంటారు.  తమ ఇంట్లోనే ఒంటరిగా ఉంటారు. ఐదు రోజుల పాటు పురుషులు మందు, మాంసం ముట్టరు. ఈ నిబంధనలు పాటించకుంటే గ్రామ దేవతకు ఆగ్రహం వచ్చి ఊరిని శపిస్తుందని వారి నమ్మకం.

ఇంత ప్రసిద్ది చెందిన ప్రాంతం అయిన కుల్లు జిల్లాలోని పినీ గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక్కడ వింత ఆచారాలు, వేడుకల గురించి బయట ప్రపంచాకి పెద్దగా తెలియదు. ఇక్కడ దేవాలయాలు, పైన్ చెట్లు పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంటాయి. పినీ గ్రామంలో శదాబ్దాల కాలం నుంచి ఈ ఆచారం కొనసాగిస్తూ వస్తున్నారు మహిళలు. దీని వెనుక ఓ కథ ఉందని అంటారు. ఒకప్పుడు పినీ గ్రామంలో రాజుసులు ఉండేవారట.. అవి గ్రామంలోని మహిళల దుస్తులను చింపి ఎత్తుకెళ్లవట. ఈ రాక్షసుల నుంచి గ్రామస్థులను కాపాడటానికి ‘లహువా ఘోండ్’ అనే దేవత ను అక్కడి గ్రామస్థులు పూజించారట. దీంతో ఆ దేవత రాక్షసులపై పోరాటం చేసి చంపి ప్రజలను కాపాడిందట. ఇదంతా భాద్రపద మాసంలో జరిగింది. అందుకే ప్రత ఏటా శ్రావణ మాసంలో 5 రోజుల పాటు మహిళలు ఎలాంటి దుస్తులు ధరించకుండా ఇంట్లో ఉంటారు. ఆ సమయంలో గ్రామంలోకి బయట వ్యక్తులను ఎవరినీ రానివ్వరు.

ఈ ప్రత్యేక పండుగలో వేరే గ్రామాలకు చెందిన వారు పాల్గొనకూడదని ఇక్కడి ఆచారం. ఇలాంటి ఆచారం ఒకటి ఉందా? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ ఇక్కడ గ్రామంలో మహిళలు ప్రతి సంవత్సరం తూ.చ. తప్పకుండా తమ ఆచారాన్ని పాటిస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఉన్న ఓ అందమైన గ్రామం పినీ. ఇది సముద్ర మట్టానికి 1950 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కుల్లు, మనాలి హిమాచల్ ప్రదేశ్ లో అద్భుతమైన పర్యాటక కేంద్రం. ప్రపంచం నలు మూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. చాలా వరకు సినీమా షూటింగ్స్ ఇక్కడ జరుపుతుంటారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments