iDreamPost
android-app
ios-app

అతి పెద్ద ల్యాండ్ డీల్.. బాంబే డైయింగ్ 22 ఎకరాలు 5,200 కోట్లు!

అతి పెద్ద ల్యాండ్ డీల్.. బాంబే డైయింగ్ 22 ఎకరాలు 5,200 కోట్లు!

ముంబయి చరిత్రలోనే అతి పెద్ద ల్యాండ్ డీల్ జరగనుంది. బాంబే డైయింగ్ కెంపెనీకి చెందిన 22 ఎకరాలను రూ.5,200 కోట్లకు జపాన్ కు చెందిన కంపెనీకి విక్రయించనున్నారు. ఒక్క గజం ధర రూ.4.83 లక్షలు, ఎకరం ధర దాదాపు రూ.236 కోట్ల వరకు పలికినట్లు అవుతుంది. ఇది దేశ ఆర్థిక రాజధానిలో జరగిన అతిపెద్ద ల్యాండ్ డీల్ అనే చెప్పాలి. వాడియా గ్రూపునకు ఉన్న అప్పులు, భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ఈ ల్యాండ్ అమ్మేస్తున్నట్లు గ్రూపు వెల్లడించింది. ఈ నిర్ణయంతో బాంబే డైయింగ్ కంపెనీ విలువ అమాతం పెరిగినట్లు అయింది.

ముంబయి వర్లీలోని 22 ఎకరాల భూమిని జపాన్ కు చెందిన సుమిటోయో రియాలిటీ అండ్ డెవలప్మెంట్ కంపెనీకి విక్రయించేందుకు డీల్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బాంబే డైయింగ్ కంపెనీ ఎక్స్ ఛేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది. ఈ డీల్ కి సంబంధించిన చెల్లింపులు మొత్తం రెండు దశల్లో జరగనున్నాయి. సుమిటోయో అనుబంధ సంస్థ అయిన గోయిసు మొదటి దశలో రూ.4,6575 కోట్లు, కొన్ని కండిషన్స్ ని పూర్తి చేసిన తర్వాత మిగిలిన రూ.525 కోట్లను చెల్లించనుంది. ఈ డీల్ ని అంగీకరించేందుకు బాంబే డెైయింగ్ కంపెనీ బోర్డు డైరెక్టర్లు భేటీ కూడా అయ్యారు. వాటాదారులు కూడా సమ్మతం తెలపడంతో ఈ డీల్ పట్టాలెక్కనుంది. వర్లీలోని 22 ఎకరాలు అమ్మేందుకు బాంబై డైయింగ్ కంపెనీ ముందుకెళ్తోంది. ఆ మొత్తాన్ని ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా బాంబే డైయింగ్ కంపెనీ వివరించింది.

ముఖ్యంగా వారి అప్పులను చెల్లించడం కోసమే ఈ భూమిని విక్రయిస్తున్నట్లు తెలిపింది. అలాగే మిగిలిన మొత్తాన్ని వారి భవిష్యత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు వినియోగిస్తామన్నారు. ఈ విషయంపై వాడియా గ్రూప్ ఛైర్మన్ నుస్లీ వాడియా స్పందించారు.. “ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వర్లీలోని 22 ఎకరాలను రూ.5,200 కోట్లకు విక్రయించేందుకు సుమోటియో కంపెనీతో ఒప్పందాలు చేసుకోబోతున్నాం” అంటూ నుస్లీ వాడియా వెల్లడించారు. ఈ ఒక్కటే కాకుండా బీడీఎంసీ గ్రూపునకు చెందిన వినియోగంలో లేని పలు భూములను విక్రయించేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారు. 35 లక్షల స్వ్కేర్ ఫీట్ గృహ, కమర్షియల్ ల్యాండ్ ని విక్రయించేందుకు కూడా వాడియా గ్రూపు సిద్ధమవుతోంది. వచ్చే మరికొన్ని సంవత్సరాల్లో రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ వార్తలతో ముంబై డైయింగ్ కంపెనీ షేర్ వ్యాల్యూ కూడా 6.5 శాతం పెరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి