వందే భారత్ రైళ్లు కొనేందుకు పోటీ పడుతున్న విదేశాలు

Vande Bharat Express: ప్రస్తుతం వందే భారత్ రైళ్లకు ఎలాంటి డిమాండ్ ఉందో తెలియనిది కాదు. వేగంతో పాటు.. సౌకర్య వంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇతర దేశాలు వీటిని కొనేందుకు పోటీ పడుతున్నాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం.

Vande Bharat Express: ప్రస్తుతం వందే భారత్ రైళ్లకు ఎలాంటి డిమాండ్ ఉందో తెలియనిది కాదు. వేగంతో పాటు.. సౌకర్య వంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇతర దేశాలు వీటిని కొనేందుకు పోటీ పడుతున్నాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం.

2019లో వందే భారత్ రైళ్లు.. ఇండియన్ రైల్వే హిస్టరీలోని సరికొత్త అధ్యయనానికి తెర తీశాయి. ఒక దాని తర్వాత మరొకటి వరుసగా పట్టాలెక్కేస్తున్నాయి. వందే భారత్ స్పూర్తితో వందే భారత్ మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక మరికొద్ది రోజుల్లో వన్డే భారత్ స్లీపర్స్ కూడా పరుగులు పెట్టనున్నాయి. ఇలా ప్రస్తుతం వీటికి ఆదరణ బాగా పెరగడంతో.. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఇలా ఎక్కడ చూసినా వందే భారత్ రైళ్లు ఆగమేఘాల మీద పరుగులు పెడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వందే భారత్ రైళ్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇతర దేశాలు ఈ రైళ్లను కొనేందుకు పోటీ పడుతున్నాయి. ఈ వందే భారత్ రైళ్లను తయారు చేసి సప్లై చేయాలనీ కోరుతున్నాయి.

ప్రస్తుతం చిలీ, కెనడా, మలేసియా వంటి దేశాలు వందే భారత్ రైళ్లపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇలాంటి దేశాలు వందే భారత్ రైళ్లను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంతో.. ఇతర దేశాల్లో కూడా వీటికి డిమాండ్ పెరుగుతుంది. వందే భారత్ రైళ్లు తయారు చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది. అందుకోసమే ఇతర దేశాలు వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది. అదే విదేశాలలో అయితే ఇలాంటి అత్యాధునిక రైళ్లను తయారు చేయడానికి కనీసం.. రూ.160 కోట్ల నుంచి రూ.180 కోట్ల మధ్య ఖర్చవుతుంది. కానీ భారత్ లో మాత్రం కేవలం రూ.120 కోట్ల నుంచి రూ.130 కోట్లతో ఈ రైళ్ల తయారీ పూర్తవుతుంది. ఈ లెక్కన చూస్తే ఒక్కో రైలుపై కనీసం రూ.40 కోట్లు ఆదా అవుతుంది. దీనితో ఇతర దేశాలు వందే భారత్ రైళ్లను కొనేందుకు పోటీ పడుతున్నాయి. అంతే కాకుండా ఈ రైళ్లు అధిక వేగాన్ని అందుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది.

జపాన్ బులెట్ రైళ్లు గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 54 సెకండ్స్ సమయం తీసుకుంటుంది. కానీ వందే భారత్ రైళ్లకు ఈ వేగాన్ని అందుకోవడానికి కేవలం 52 సెకండ్స్ మాత్రమే పడుతుంది. పైగా విదేశీయులు కూడా ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలను.. స్వతహాగా ఎక్సెపీరియెన్స్ చేయడంతో.. దీనికి డిమాండ్ ఇంకాస్త బాగా పెరిగింది. అంతే కాకుండా ఈ వందే భారత్ రైళ్లు విమానం కంటే 100 రెట్లు తక్కువ శబ్దాన్ని విడుదల చేస్తాయి. అలాగే ఈ రైళ్లను నడిపేందుకు ఉపయోగించే ఇంధనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఏ రకంగా చూసినా కానీ.. ఈ రైళ్ల వలన చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకు ఇరుగు పొరుగు దేశాలు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి.. వస్తున్న ఆర్డర్లు, అదే సమయంలో అంతర్జాతీయ రైళ్ల తయారీకి ఉన్న పోటీని తట్టుకోలేక.. వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా రైళ్ల తయారీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అంతే కాకుండా మన దేశంలో కూడా మరిన్ని మార్గాలలో వీలైనంత త్వరగా.. ఈ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మరి వందే భారత్ కు హై డిమాండ్ పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments