iDreamPost
android-app
ios-app

వందే భారత్ రైలు భోజనంలో బొద్దింక.. IRCTC ఏమన్నదంటే.. ?

ఇటీవల కాలంలో రైల్వే ప్రయాణాలంటే ఉలిక్కి పడేలా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ రైళ్లలోనే కాదు వందే భారత్ వంటి మెరుగైన సదుపాయాలున్న ట్రైన్లలో కూడా ప్రయాణీకులకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి.

ఇటీవల కాలంలో రైల్వే ప్రయాణాలంటే ఉలిక్కి పడేలా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ రైళ్లలోనే కాదు వందే భారత్ వంటి మెరుగైన సదుపాయాలున్న ట్రైన్లలో కూడా ప్రయాణీకులకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి.

వందే భారత్ రైలు భోజనంలో బొద్దింక.. IRCTC ఏమన్నదంటే.. ?

భారత రైల్వే వ్యవస్థ అప్ గ్రేడ్ అయ్యింది. దేశంలో జనాబా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త రైళ్లను తీసకువస్తుంది. సూపర్ ఫాస్ట్‌ల నుండి బుల్లెట్ రైళ్లను తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తీసుకు వచ్చిన సంగతి విదితమే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సర్వీసులు అందిస్తున్నాయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు. వీటి బాగా ఆదరణ పెరగడంతో మరిన్ని ట్రైన్లను తీసుకువచ్చేందుకు విశేషమైన కృషి చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో ఈ రైళ్లను తీసుకురాగా, తరచుగా ఆహారం విషయంలో ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.

మళ్లీ అదే నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో. భోజనం దుర్వాసన వస్తుంది, పురుగులు, కీటకాలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయి. గతంలో ఓసారి బొద్దింక దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత యోగర్ట్ లో ఫంగస్ కనిపించడంతో.. షాక్ తిన్న ప్రయాణీకుడు.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అప్పుడో సారి రచ్చ అయ్యింది. ఇప్పుడు మరో ప్రయాణీకుడికి చేదు అనుభవం ఎదురైంది. భోపాల్ నుండి ఆగ్రాకు వందే భారత్ రైలులో వెళుతున్నారు దంపతులు. వారు భోజనం ఆర్డర్ చేయగా.. పార్శిల్ వచ్చింది. ప్యాకెట్ తెరచి చూసే సరికి అందులో బొద్దింక కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు దంపతులు. ఈ ఘటనను ఫోటో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు విది వర్షిణీ అనే ట్విట్టర్ యూజర్. తనకు అంకుల్, ఆంటీకి ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని పేర్కొన్నాడు.

Cockroach in vande bharat food

వీరిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే సేవ, IRCTC పాటు పలువురికి ట్యాగ్ చేశాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. కాగా, ఈ ఫుడ్ IRCTC సప్లై చేసింది. ఈ ఘటనపై రెండు గంటల తర్వాత  స్పందించింది  సదరు సంస్థ. సార్ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈ విషయం సీరియస్ గా తీసుకున్నామని, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కు జరినామా విధించినట్లు తెలిపింది. తయారీ, లాజిస్టిక్స్ పర్యవేక్షణను కూడా తీవ్ర తరం చేస్తామని తెలిపింది. అదేవిధంగా రైల్వే సేవ కూడా స్పందించింది. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నామని, పీఎన్ఆర్ నంబర్, మొబైల్ నంబర్ పంపిస్తే.. చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇది షరా మామూలుగా మారింది.