iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు షాక్.. ఇకనుంచి వందే భారత్ లో అవి బంద్

వందే భారత్ ప్రయాణికులకు భారతీయ రైల్వే షాకిచ్చింది. వాటి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అవి బంద్ కానున్నాయి. ఇంతకీ అవి ఏంటంటే?

వందే భారత్ ప్రయాణికులకు భారతీయ రైల్వే షాకిచ్చింది. వాటి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అవి బంద్ కానున్నాయి. ఇంతకీ అవి ఏంటంటే?

ప్రయాణికులకు షాక్.. ఇకనుంచి వందే భారత్ లో అవి బంద్

రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు సెమీ హైస్పీడ్ రైళ్లను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. వందే భారత్ రైళ్లకు ప్రయాణికులనుంచి మంచి ఆదరణ లభించింది. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికులకు మరిన్ని వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావించిన సెంట్రల్ గవర్నమెంట్ గత నెలలో మరో 10 వందే భారత్ రైళ్లను వర్చవల్ గా ప్రారంభించారు ప్రధాని మోడీ. అయితే తాజాగా వందే భారత్ ప్రయాణికులకు భారతీయ రైల్వే షాకిచ్చింది. ఇక నుంచి వందే భారత్ లో అవి బంద్ కానున్నాయి.

మామూలుగా రైలు ప్రయాణం చేసేటపుడు భారతీయ రైల్వే నిషేధించిన వస్తువులను తీసుకెళ్లకూడదు. ఒక వేళ తీసుకెళ్లినట్లైతే జరిమానా విధించడమో లేదా శిక్షించడం చేస్తారు. ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులు రైలు ప్రయాణంలో పూర్తిగా నిషేదం. అయితే వందే భారత్ లో మాత్రం ఇప్పటి నుంచి లీటర్ వాటర్ బాటిల్స్ కనిపించవు. ఇక నుంచి వందే భారత్ ట్రైన్ లలో ఒక లీటర్ బాటిల్‌లు కాకుండా అరలీటర్ బాటిల్‌లు మాత్రమే అందించనున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. వందే భారత్‌తో పాటు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా లీటర్ బాటిల్‌ల స్థానంలో అరలీటర్ బాటిల్‌లు కనిపించనున్నాయి.

Vande Bharat is a shock for passengers

తాగు నీటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు, నీటి వృథాను అరికట్టేందుకు అరలీటర్ వాటర్ బాటిల్స్ అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా రైల్వే అధికారులు ప్రయాణికులకు వందే భారత్ రైలు టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకునే సదుపాయాన్ని కల్పించారు. అయితే భోజనంతో పాటు ప్రతీ ప్రయాణికుడికి ఒక లీటర్ వాటర్ బాటిల్‌ను కూడా రైల్వే శాఖ అందిస్తోంది. అయితే ప్రయాణికులు లీటర్ వాటర్ ను పూర్తిగా వినియోగించుకోక పోవడంతో నీరు వృథా అవుతుందని భారతీయ రైల్వే భావించింది. ఈ కారణంగా లీటర్‌ వాటర్‌ బాటిల్‌ స్థానంలో అరలీటర్ బాటిల్‌ను అందించనున్నారు అధికారులు.