P Krishna
Train Accident: గత కొంత కాలంగా దేశంలో తరుచూ రైల్ ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది బాలేశ్వర్ లో జరిగిన రైలు ప్రమాదంలో 300 మంది చనిపోయారు.
Train Accident: గత కొంత కాలంగా దేశంలో తరుచూ రైల్ ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది బాలేశ్వర్ లో జరిగిన రైలు ప్రమాదంలో 300 మంది చనిపోయారు.
P Krishna
దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో రైలు ప్రయాణం చేస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. సుదూర ప్రయాణాలు చేసేవారు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. బస్సు కన్నా ఇది తక్కువ ధర, ఎన్నో సదుపాయాలు ఉంటాయి. అంతేకాదు సురక్షితం అని భావిస్తుంటారు. కానీ.. ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది ఒడిశాలోని బాలేశ్వర్ లో జరిగిన ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటే ఇప్పటికీ వణికిపోతారు. ఈ ఘటనలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో రైలు ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగించింది. వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి.. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఒడిశా రైలు ప్రమాదం భయబ్రాంతులకు గురి చేసింది. మూడు రైళ్లు నిమిషాల వ్యవధిలో ప్రమాదానికి గురయ్యాయి.. ఈ ఘటనలో 300 మంది చనిపోగా వేయ్యి మంది ఆస్పత్రి పాలయ్యారు. రైల్వే చరిత్రలోనే అత్యంత విషాద సంఘటనలో ఇది ఒకటిగా నిలిచింది. తాజాగా బిహార్ లోని గయా జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. గయా జిల్లాలో ఉన్న ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్‌లోని సెక్షన్ సమీపంలో మాన్‌పూర్ జంక్షన్ లో సిగ్నల్ వద్ద ఓవర్ హెడ్ వైరు తెగిపోయింది..ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై రాంచి – పట్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్, రాంచీ – పట్నా జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ లను ముందు జాగ్రత్త చర్యగా నిలిపి వేశారు.
మాన్‌పూర్ జంక్షన్‌లో హోం సిగల్ తెగిపోయిన వైరు సరిచేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. దీంతో వందే భారత్, జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఉన్న ప్రజలు మొదట భయంతో వణికిపోయారు.. కొంతమంది దిగి వెళ్లిపోయారు. సుమారు రెండు గంటల సమయం పట్టడంతో ఇరు రైళ్లలో ఉన్న ప్రయాణికులు తెగ ఇబ్బంది పడ్డారు. మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత ఈ మార్గంలోని కార్యాకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. కాగా, ప్రమాదం అని తెలిసిన వెంటనే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని గుర్పా రైల్వే స్టేషన్ లో.. జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ ని టంకుప్ప రైల్వే స్టేషన్ లో నిలిపి వేసినట్లు రైల్వే అధికారలు తెలిపారు. మొత్తానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.