Cat: పిల్లికి బలైన బిలియనీర్ కుటుంబం.. అసలేం జరిగిందంటే..?

Cat: ఓ పిల్లి వల్ల దారుణం జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని ఓ బిలియనీర్ కుటుంబం భస్మం అయిపోయింది.

Cat: ఓ పిల్లి వల్ల దారుణం జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని ఓ బిలియనీర్ కుటుంబం భస్మం అయిపోయింది.

దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఓ బిలియనీర్ ఇంట్లో విషాదం జరిగింది. ఆయన కుటుంబానికి దీపావళి పండుగ చావు దినంగా మారింది. అది కూడా ఓ పిల్లి వల్ల కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఇంతకీ ఏమైంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫేమస్ బిజినెస్ మ్యాన్ సంజయ్ శ్యామదాసాని లగ్జరీ బంగ్లా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో సంజయ్ శ్యామదాసాని, అతని భార్య కనిక, పనిమనిషి ఛవి పొగ కారణంగా ఊపిరాడక చనిపోయారు.

శ్యామదాసాని ఫ్యామిలీ దాదాపు 50 ఏళ్ల క్రితం కాన్పూర్ కి వచ్చింది. మొదట్లో వీరి కుటుంబ పెద్ద చిన్న కిరాణా దుకాణాన్ని నడిపేవాడు. అయితే కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పంక్చర్ షాప్ తెరవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎలాగోలా కొంచెం అప్పు తీసుకుని వ్యాపారం మొదలు పెట్టారు. దాంతో వారి దశ తిరిగిపోయింది. ఆ తర్వాత వారు వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఈ కుటుంబం పార్లే-జి బిస్కెట్ ఫ్రాంచైజీతో పాటు ఇతర వ్యాపారాలను కూడా చేస్తుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో స్టార్ బిలియనీర్‌లలో ఒకరిగా సంజయ్ శ్యామదాసాని ఉన్నారు.శ్యామదాసాని కుటుంబం అంతా కూడా ఒకే ఇంట్లో ఉండేవారు. సంజయ్ తన భార్య, కొడుకు, వారి పనిమనిషి పై అంతస్తులో ఉన్నారు. దీపావళి రోజున కొడుకు స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళాడు. కానీ సంజయ్ మాత్రం అతని భార్యతో కలిసి నిద్రపోయాడు. కానీ ఆ రాత్రి వారికి కాల రాత్రిగా మిగిలింది. ఆరోజు రాత్రి, దీపావళి దీపం నుండి మంటలు చెలరేగాయి. ఆ మంటలు నేల మొత్తం కూడా వ్యాపించాయి. పండగకు కొన్ని రోజుల ముందు సంజయ్ ఇంట్లో కలపతో ఫాల్స్ సీలింగ్ చేయించాడు. ఇంట్లో తలుపులు, కిటికీలను సౌండ్ ప్రూఫ్ చేసి ఎలక్ట్రానిక్‌గా మార్చారు. అయితే ఇంట్లో దీపం కారణంగా అంటుకున్న మంటలు, ఇల్లంతా కూడా వ్యాపించాయి. దాంతో తలుపులు, కిటికీలు జామ్‌ అయ్యాయి. దీంతో పాపం కుటుంబ సభ్యులంతా ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలిసింది. కలప, ఫాల్స్ సీలింగ్ కారణంగా మంటలు స్పీడ్ గా వ్యాపించాయి.

ప్రమాదం జరిగిన తర్వాత ఇంట్లో ఎలా మంటలు చెలరేగాయన్న కోణంలో దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ దర్యాప్తులో ఈ ప్రమాదానికి కారణం పిల్లి అని తెలిసింది. సంజయ్ కుటుంబానికి ఒక పిల్లి ఉంది. అయితే అది కూడా ప్రమాదంలో మరణించింది. ఆ పిల్లి దూకడం వల్లనే ఇంట్లోని దేవుడి వద్ద ఉంచిన దీపం పడి మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన ఈ పిల్లికి కూడా పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ ఇంట్లో వెంటిలేషన్ ఉండి, తలుపులు ఎలక్ట్రానిక్ గా లేకుంటే, బహుశా ఆ కుటుంబం ప్రాణాల నుంచి బయట పడుండేదని అగ్ని మాపక నిపుణులు తెలుపుతున్నారు. ఇదీ సంగతి. కేవలం ఒక పిల్లి కారణంగా ఇలా బిలియనీర్ కుటుంబమే నాశనం అయ్యింది. ఈ ప్రమాదంపై ఇంకా పలు అనుమానాలు రేకెస్తున్నాయి. ఇక దీని గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments