Tirupathi Rao
భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు.. అదొక ఎమోషన్ కూడా. అలాంటి ఎమోషన్ ఇప్పుడు ఉత్తరకాశీ టన్నెల్ బాధితుల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషించందనే విషయం మీకు తెలుసా?
భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు.. అదొక ఎమోషన్ కూడా. అలాంటి ఎమోషన్ ఇప్పుడు ఉత్తరకాశీ టన్నెల్ బాధితుల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషించందనే విషయం మీకు తెలుసా?
Tirupathi Rao
ఉత్తరాఖండ్- ఉత్తర కాశీ జిల్లా.. గత 17 రోజులుగా దేశవ్యాప్తంగా ఈ పేర్లు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఎన్నో దేశాలు కూడా ఉత్తరకాశీ జిల్లాపై ఫోకస్ పెట్టాయి. ఇందుకు కారణం.. దాదాపు 17 రోజుల క్రితం సిల్క్ యారా టన్నెల్ మధ్య భాగంలో ప్రమాదం జరిగింది. 150కి పైగా మీటర్లు టన్నెల్ కూలిపోయింది. ఆ సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వాళ్లని ఎంతో శ్రమించి విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో వారి ప్రాణాలు కాపాడటంలో క్రికెట్ కూడా కీలక పాత్ర పోషించిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అసలు ఆ క్రికెట్ ఏంటి? క్రిెకెట్ ప్రాణాలు కాపాడం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివేయండి.
టన్నెల్లో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని దాదాపు 17 రోజులు శ్రమించి ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేశ ప్రజలు, ప్రధాని, రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 41 కుటుంబాల్లో ఆనందాన్ని నింపారంటూ ప్రశంసిస్తున్నారు. అయితే వ్యక్తులు, యంత్రాలు మాత్రమే కాకుండా వారి ప్రాణాలు కాపాడిన విషయాల్లో క్రికెట్ కూడా ఒక భాగం అని చెబుతున్నారు. ఈ సహాయకచర్యల్లో కీలకంగా వ్యవహరించిన ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్ పర్ట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ చెప్పిన మాటలతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ.. “టన్నెల్ లోపల చిక్కుకున్న బాధితులు క్రికెట్ ఆడారంటూ నేను విన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఆ కామెంట్ తర్వాతే ఆ విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు అదే విషయం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకున్న వాళ్ల మానసిక స్థితి గందరగోళంగా ఉంటుంది. అసలు బతుకుతామో? లేదో? అనే భయాలతో మానసికంగా కుంగిపోయి ఉంటారు. అలా భయపడటం వల్ల.. కార్డియాక్ అరెస్ట్, పానిక్ అటాక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. పైగా అందరూ ఒకే దగ్గర ఉండటం వల్ల.. ఒకరి వల్ల మరొకరు మెంటల్ గా డల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోకి వారు చేరకుండా మానసికంగా ఉత్సాహంగా, ధైర్యంగా, మనోనిబ్బరంతో నిలబడటానికి క్రికెట్ వారికి ఎంతో దోహదపడింది.
క్రికెట్ ఆడటం వల్ల వారు శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉన్నారు. మనోస్థైర్యంగా 17 రోజులు ఆ టన్నెల్లో మృత్యువుతో పోరాడారు. చివరికి విజయం సాధించి.. మృత్యుంజయులుగా బయటకు వచ్చారు. ఈ సహాయకచర్యల్లో పాల్గొన్న వారికి ఎంత క్రెడిట్ దక్కుతుందో.. క్రికెట్ ఆటకు కూడా అంతే క్రెడిట్ దక్కుతుందంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇండియాలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదని.. అదొక ఎమోషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు 41 మంది ప్రాణాలతో ఉన్నారంటే క్రికెట్ అనే ఎమోషన్ కూడా ఒక కారణం అంటూ గర్వంగా చెబుతున్నారు. మరి.. టన్నెల్ లో చిక్కుకున్న వాళ్లు క్రికెట్ ఆడారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.