iDreamPost

భర్త పోలీస్ అయినంత మాత్రాన ఇలా చేస్తారా? ఆ మహిళ తీరుపై మండిపడుతున్న నెటిజన్స్!

భర్త పోలీస్ అయినంత మాత్రాన ఇలా చేస్తారా? ఆ మహిళ తీరుపై మండిపడుతున్న నెటిజన్స్!

భర్త మంచి హోదాలో ఉండి సమాజంలో గుర్తింపు ఓ సంపాదించుకుని బతుకుతుంటే ఏ భార్య అయిన తలెత్తుకుని తిరుగుతుంది. అదే భర్త పోలీస్ అయితే.. ఇక చెప్పక్కర్లేదు. కొందరు భార్యలు హుందాగా ప్రవర్తించి అందరితో మర్యాదగా మెలుగుతుంటే.. మరి కొందరు మాత్రం.., నా భర్త పోలీస్ అని చెప్పుకుని విర్రవీగుతుంటారు. అచ్చం ఇలాగే ఓ మహిళ.. నా మొగుడు పోలీస్ అని చెప్పుకుని ఎవరూ ఊహించని చర్యకు పాల్పడి పోలీసులకు అడ్డంగా దొరికింది. ఆమె చేసిన పనికి అందరూ మండిపడుతున్నారు. ఈ పోలీస్ అధికారి భార్య ఏం చేసింది? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కడప వైవీ స్ట్రీట్ లో పరిధిలోని ఓ కాలనీలో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆమె భర్త నగరంలో ఓ ప్రత్యేక విభాగానికి పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈ మహిళ.. ఊహించని దారుణానికి ఒడిగట్టింది. అసలు విషయం ఏంటంటే? ఈ మహిళ ఇటీవల కడప వైవీ స్ట్రీట్ లోని ఓ బట్టల దుకాణానికి వెళ్లింది. అక్కడ ఆమె కొనుగోలు చేసింది. ఇక కొన్న ఆ బట్టలకు ఆ మహిళ డబ్బులు చెల్లించకుండా.. నేను పోలీస్ అధికారి భార్యను అంటూ విర్రవీగి అక్కడి నుంచి వెళ్లి పోయే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆ దుకాణ దారుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీనిపై స్పందించిన పోలీసులు ఆ మహిళను స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత నేను పోలీస్ అధికారి భార్యను అంటూ పోలీసులకు సైతం చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు ఆ మహిళకు మళ్లీ ఇలాంటి పనులు చేయకూడదంటూ ఆమెకు కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. ఇదే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్స్.. భర్త పోలీస్ అయినంతా మత్రాన ఇలా డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతారా అంటూ ఆ మహిళ తీరుపై మండిపడుతున్నారు. భర్త పోలీస్ అని చెప్పి దుకాణ దారుడికి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోవాలని చూసిన ఈ మహిళ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పోలీస్ స్టేషన్ లో నిందితుడు మృతి! అసలేం జరిగిందంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి