iDreamPost
android-app
ios-app

బాలికపై అత్యాచారం.. BJP ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు!

ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో కొందరు దారుణమైన ఘటనలకు పాల్పడుతుంటారు. అయితే చట్టం ముందు అందరూ సమానమే భారతీయ న్యాయస్థాన సిద్ధాంతం ప్రకారం.. అనేక మంది నేతలు శిక్షలు పడ్డాయి. తాజాగా ఓ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది.

ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో కొందరు దారుణమైన ఘటనలకు పాల్పడుతుంటారు. అయితే చట్టం ముందు అందరూ సమానమే భారతీయ న్యాయస్థాన సిద్ధాంతం ప్రకారం.. అనేక మంది నేతలు శిక్షలు పడ్డాయి. తాజాగా ఓ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది.

బాలికపై అత్యాచారం.. BJP ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు!

ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తులు. అంటే.. నిత్యం తమ పరిధిలో ఉన్న ప్రజాసమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలి. అయితే చాలా మంది నేతలు అలానే తమ విధులు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కొందరు నేతలు మాత్రం అవినీతి అక్రమాలకు పాల్పడి..ప్రజలను పీడిస్తున్నారు. మరికొందరు అయితే  పశువుల్లా మారి ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని కోర్టులు కూడా గట్టిగానే శిక్షిస్తున్నాయి. తాజాగా బాలిక అత్యాచార కేసులో ఓ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులార్‌ గోండ్‌కు స్పెషల్ కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాక జైలు శిక్షతో పాటు మరో రూ.10 లక్షల జరిమానాను కూడా విధించింది. ఇక ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో సదరు ఎమ్మెల్యే తన శాసనసభ సభ్యత్వాని కోల్పోనున్నారు. అయితే ఈ బాలికపై అత్యాచారం చేసిన ఘటన తొమ్మిదేళ్ల క్రితం చోటుచేసుకుంది. అప్పట్లో  ఈ ఘటనపై కేసు నమోదు చేయగా.. సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగింది.  చివరగా ఈ ఘటనపై ఈ నెల 12న ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ముగిసింది.

సోన్‌భద్ర అదనపు న్యాయమూర్తి, ప్రజాప్రతినిధుల కోర్టు సెషన్ న్యాయమూర్తి అహ్నానుల్లా ఖాన్ తాజాగా తీర్పు ఇచ్చారు. సదరు ఎమ్మెల్యేకు 25 ఏళ్లు జైలు శిక్ష విధించారు. అంతేకాక రూ.10 లక్షల జరిమానా కూడా విధించారు. ఆ జరిమానా మొత్తాన్ని బాధితురాలి కుటుంబ సంక్షేమం కోసం వినియోగించాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014లో రామ్‌దులార్‌ గోండ్‌ భార్య గ్రామ సర్పంచిగా ఉన్నారు. నేడు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో రామ్ దూలార్ పై పోక్సో చట్టంతో పాటు వివిధ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసుపై తొలుత పోక్సో ప్రత్యేక కోర్టులో కేసు విచారణ సాగింది. అయితే  బీజేపీ తరఫున గోండ్‌ దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. దీంతో ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయ్యింది. సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగిన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ప్రజాప్రతినిధులే హత్యలు చేయడం, మానభంగాలు చేసిన ఘటనలు కొన్ని జరిగాయి. మరి.. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.