UP టాపర్‌ ఆవేదన.. ‘నేను ఫస్ట్‌ రాకుండా ఉండాల్సింది’

UP Tenth Topper Prachi Nigam: పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి.. స్టేట్‌టాపర్‌గా నిలిచిన యువతిని ప్రశంసించాల్సింది పోయి.. ఆమె రూపు రేఖలు చూసి ఎగతాళి చేస్తోన్న వారికి సదరు విద్యార్థిని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

UP Tenth Topper Prachi Nigam: పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి.. స్టేట్‌టాపర్‌గా నిలిచిన యువతిని ప్రశంసించాల్సింది పోయి.. ఆమె రూపు రేఖలు చూసి ఎగతాళి చేస్తోన్న వారికి సదరు విద్యార్థిని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

మనిషి ఎదుగుదలకు కావాల్సింది తెలివితేటలు, ప్రతిభ. మనలో టాలెంట్‌ ఉండాలే కానీ.. ఎలాంటి శారీరక, మానసిక వైఫల్యాలు మన ఎదుగుదలను అడ్డుకోలేవు. ఇందుకు నిదర్శనంగా నిలిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. శారీరక, మానసిక వైకల్యం ఉ‍న్న వారు సైతం.. మనో ధైర్యంతో ముందడుగు వేసి.. అవరోధాలను దాటుకుని.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కానీ దురదృష్టవశాత్తు మన సమాజంలో చాలా మంది బుద్ది.. పైకి కనిపించే రూపుకే అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంది. కాస్త రంగు తక్కువగా ఉన్నా.. లావున్నా.. ఇక ఇతర లోపాలు ఏవున్నా.. అలాంటి వారిని ఎగతాళి చేస్తాం. సెలబ్రిటీలు మొదలు.. సామాన్యుల వరకు ఇలా బాడీ షేమింగ్‌కు గురయిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థినిని ఎంతలా వేధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుని స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్‌.. ప్రతిభను ప్రశంసించాల్సింది పోయి.. ఆమె రూపు రేఖలను చూసి అపహాస్యం చేసిన వారు ఎందరో ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రాచీని వేధించారు. అయితే తనను విమర్శించే వారికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తోంది ప్రాచీ. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై వస్తోన్న విమర్శలు, తన శరీరంపై ఉన్న అవాంఛిత రోమాల గురించి ఎగతాళి చేస్తూ.. చేస్తోన్న కామెంట్స్‌పై స్పందిస్తూ.. ప్రాచీ నిగమ్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ప్రాచీ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్న వారంతా.. ఏదో ఓ సందర్భంలో ఇలా విమర్శలు ఎదుర్కొన్న వారే. చాణుక్యుడు కూడా ఎందరో రాజుల వద్ద నుంచి విమర్శలు చవి చూశాడు. నేను చిన్నతనం నుంచి ఆయన కొటేషన్లు చదువుతూ.. నన్ను నేను ప్రోత్సాహించుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఈ విమర్శలు నన్ను ఏం చేయలేవు. కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంది.. నేను కొన్ని తక్కువ మార్కులు తెచ్చుకొని ఉండాల్సింది. అలా అయితే ఈ ట్రోలింగ్‌ బాధ తప్పేదేమో. సోషల్‌ మీడియా వేదికగా చాలా మంది నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఈ విమర్శలు నన్ను ఏం చేయలేవు. నా లక్ష్యం చేరకుండా ఆపలేవు. ఇలాంటి విమర్శల్ని నేను పట్టించుకోను. బాగా చదువుకుని ఇంజనీర్‌ కావాలనేది నా కల. దాన్ని సాధిస్తాను’’ అని చెప్పుకొచ్చింది.

ఇక ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ ఏప్రిల్ 20న , ఎస్సెస్సీ ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. దీనిలో.. ప్రాచీ నిగమ్.. 600కు గాను 591 మార్కులు సంపాదించి.. 98.50 శాతం పర్సెంటెజ్‌ సాధించి.. యూపీ స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. కానీ కొందరు మాత్రం దుర్బుద్ధితో ఆమె ప్రతిభను కాకుండా.. రూపు రేఖల గురించి మాట్లాడుతూ.. విమర్శలు చేశారు. అలాంటి వారికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది ప్రాచీ నిగమ్‌.

Show comments