UP Sweeper: యూపీలో కోట్లకు పడగలెత్తిన స్వీపర్.. ఇంట్లో 9 లగ్జరీ కార్లు, కోట్ల ఆస్తులు

UP Sweeper: యూపీలో కోట్లకు పడగలెత్తిన స్వీపర్.. ఇంట్లో 9 లగ్జరీ కార్లు, కోట్ల ఆస్తులు

Sweeper Owns 9 Luxury Cars, Luxury House Worth Crores: డబ్బు సంపాదించడం అంత వీజీ కాదు. డబ్బులు ఊరికే రావు అని ఊరికే అనలేదు. ఎన్నో ఏళ్ళు కష్టపడితేనే గానీ కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగరు. కానీ ఒక స్వీపర్ మాత్రం అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంట్లో 9 లగ్జరీ కార్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అతను ఏం చేసి సంపాదించాడంటే?

Sweeper Owns 9 Luxury Cars, Luxury House Worth Crores: డబ్బు సంపాదించడం అంత వీజీ కాదు. డబ్బులు ఊరికే రావు అని ఊరికే అనలేదు. ఎన్నో ఏళ్ళు కష్టపడితేనే గానీ కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగరు. కానీ ఒక స్వీపర్ మాత్రం అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంట్లో 9 లగ్జరీ కార్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అతను ఏం చేసి సంపాదించాడంటే?

ఈరోజుల్లో డబ్బు సంపాదించడం అంటే చాలా కష్టం. మళ్ళీ ఈ ఇరుకు జీవితంలో డబ్బులు పోగేయడం అంటే మహా కష్టం. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మిడిల్ క్లాస్ వారికి మెంటల్ వచ్చేస్తుంది. ఒక మంచి బైక్ కొనుక్కోలేక పాత బండి మీదనే తిరిగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక పేదవాళ్ళు అయితే ఈ సంపాదించడాలు, పోగుజేయడాలు మనవల్ల కాదేహే అని చేతులెత్తేసే పరిస్థితి. వచ్చే ఆదాయానికి, అవసరాలకు పెట్టే ఖర్చులకు సంబంధమే ఉండడం లేదు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఆదాయం కంటే కూడా అప్పులే ఎక్కువ కలిగి ఉన్నారనేది వాస్తవం. చిన్న, పెద్ద వ్యాపారాలు చేసే వారికి ఎలా చూసినా గానీ లాభమే. టీ పాయింట్, పానీ పూరీ బండి, టిఫిన్ సెంటర్స్ వంటి వ్యాపారాలు చేసేవారికి డబ్బు సమస్య కానే కాదు. చిరు ఉద్యోగులకే ఎటొచ్చి సమస్య. ఇక స్వీపింగ్ వృత్తిలో ఉండేవారికి ఏ మాత్రం ఆదాయం ఉంటుందో అందరికీ తెలిసిందే. వాళ్లకి వచ్చేదే తక్కువ. కానీ ఓ స్వీపర్ కి మాత్రం కోట్లలో ఆస్తులు, 9 లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లు ఉన్నాయి.

చేసే పని స్వీపింగ్. కానీ ఆ స్వీపర్ కోట్ల ఆస్తులకు వారసుడు. ఇన్ని ఉండగా స్వీపర్ పని ఎందుకు చేస్తున్నాడు. భాష సినిమాలో రజినీకాంత్ రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? అని అనుకుంటే పొరపాటే. స్వీపర్ గా చేస్తూనే కోట్లు వెనకేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన సంతోష్ జైస్వాల్ కొన్నాళ్ల క్రితం గోండా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు.  ఆ తర్వాత డివిజనల్ కమిషనర్ ఆఫీసులో నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ పొందాడు. కట్ చేస్తే అతని ఆస్తులు, ఇల్లు, ఇంట్లో లగ్జరీ కార్లు చూసి అధికారులు షాక్ అయ్యారు. స్వీపర్ కి ఇన్ని కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు ఉండడం చూసి కంగుతిన్నారు. కమిషనర్ ఆఫీసులో నజీర్ గా చీసుత్న్నాడు. ప్రభుత్వ ఫైల్స్ ని తారుమారు చేసి కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించాడు. ఈ విషయం తెలిసిన అధికారులు సంతోష్ జైస్వాల్ మీద కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు రావడంతో కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

విచారణలో సంతోష్ కుమార్ జైస్వాల్ కూడబెట్టిన ఆస్తుల వివరాలు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇల్లు వంటివి బయటపడ్డాయి. దీంతో అధికారులు సంతోష్ కుమార్ ని సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. సంతోష్ కుమార్ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణలో భాగంగా లగ్జరీ కార్ల గురించి సమాచారం సేకరించారు. ఒకటి, రెండు కాదు ఏకంగా 9 లగ్జరీ కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్విఫ్ట్ డిజైర్, మారుతి సుజుకీ ఎర్టిగా, మహీంద్రా స్కార్పియో, టయోటా ఇన్నోవా, మహీంద్రా సెలో కార్లు ఉన్నాయి. ఇక సంతోష్ సోదరుడు ఉమాశంకర్ జైస్వాల్ పేరు మీద మారుతీ సుజుకీ ఎర్టిగా, భార్య బేబీ జైస్వాల్ పేరు మీద టయోటా ఇన్నోవా కార్లు ఉన్నాయి. సంతోష్ కుమార్ బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా ఇవ్వమని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు సంతోష్ కుమార్ పై విచారణ కొనసాగుతుంది. బ్యాంకు రికార్డులు పరిశీలించిన తర్వాత సంతోష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోనున్నారు.  

Show comments