Dharani
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఈ క్రమంలో తాజాగా ఓ చోట వెలుగు చూసిన అగ్ని ప్రమాదంలో గ్రామం మొత్తం దగ్ధమైంది. ఆ వివరాలు..
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఈ క్రమంలో తాజాగా ఓ చోట వెలుగు చూసిన అగ్ని ప్రమాదంలో గ్రామం మొత్తం దగ్ధమైంది. ఆ వివరాలు..
Dharani
మిగతా కాలాలతో పోలిస్తే.. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. మార్చి ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక నేడు అనగా శుక్రవారం నాడు కూడా హైదరాబాద్, కూకట్‌పల్లిలో కూలర్ల షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో టైర్ పంచర్ దుకాణం, కూలర్ షాప్ బూడిదయ్యాయి. ఇలా ఉండగా నేడు మరో చోట భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా ఊరంతా దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదం ఎక్కడ చోటు చేసుకుంది అంటే..
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. గోండాలోని ధనేపూర్ ప్రాంతంలోని చకియా గ్రామంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక ఈ ప్రమాదంలో గ్రామం మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఊరంతా మంటలు వ్యాపించడంతో.. ఒక గేదె మంటల్లో దహనం అయ్యింది. అలానే ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఒక్క సారిగా పెద్దఎత్తున మంటలు రావడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. కొందరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి.. మంటల్లో చిక్కుకున్న వృద్ధులు, పిల్లలు, పశువులను రక్షించేందుకు ప్రయత్నించారు.
మంటల తీవ్రత భారీగా ఉండటంలో.. గ్రామంలోని గడ్డి ఇళ్ళు మొత్తం బూడిదయ్యాయి. అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే విద్యుత్ అధికారులు.. అప్రమత్తమై.. గ్రామానికి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిప్రమాదం కారణంగా కంట్రోల్ రూంలో అమర్చిన సుమారు రూ.3 లక్షల విలువైన విద్యుత్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయని ఎస్‌డీఓ అమిత్ మౌర్య తెలిపారు. మంటలను చల్లార్పిన తర్వాత కరెంటు సరఫరా చేయగానే 33 వేల కెవి విద్యుత్ లైన్ ట్రిప్ అయిందని వెల్లడించారు. ఆ తర్వాత ఫీడర్ సప్లై స్విచ్ ఆన్ చేయగానే కంట్రోల్ రూం ఒక్కసారిగా కాలిపోయింది. ఎనిమిది ఎంవీఏ ప్యానెళ్ల సీటీ, మెయిన్ కేబుల్ కాలిపోయి దెబ్బతిన్నాయి అని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇక నేడు అనగా శుక్రవారం నాడు బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పెళ్లింట చోటు చేసుకున్న ఫైర్ యాక్సిడెంట్ తీవ్ర విషాదాన్ని నింపింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.