Krishna Kowshik
భార్యా భర్తల బంధాన్ని శృంగారం మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఇప్పడు ఓ మహిళ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ కేసు కోర్టుకు చేరగా.. సంచలన తీర్పునిచ్చింది.
భార్యా భర్తల బంధాన్ని శృంగారం మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఇప్పడు ఓ మహిళ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ కేసు కోర్టుకు చేరగా.. సంచలన తీర్పునిచ్చింది.
Krishna Kowshik
భార్యా భర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేసేది, బలహీనతకు కారణమయ్యేది శృంగారమే. ఇద్దరి మధ్య సరైన ఫిజికల్ రిలేషన్స్ లేకుంటే ఆ కాపురం పెటాకుల వరకు వెళుతుంది. భర్త అస్తమాను ముద్దు ముచ్చట్లతో చంపేస్తుంటే.. ఇబ్బందిని ఎదుర్కొంటున్న భార్యలున్నారు. పని పేరుతో భార్యను పట్టించుకోకుండా సమయాన్ని గడిపేస్తున్న భర్తలున్నారు. శృంగారంలో భర్తకు సహకరించని భార్యలు ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరు పడక సుఖానికి సహకరించకపోయినా దాంపత్య నావ ఛిన్నాభిన్నం అవుతుంది. అయితే బాధ్యతలు, బంధాలు దృష్ట్యా కొంత మంది మహిళలు.. భర్తలను లైంగిక వాంఛను అందించలేకపోతున్నారు. దీంతో ఒక్కోసారి బలవంతంగా భార్యతో కామ కోరికను తీర్చుకుంటున్నాడు. ఈ చర్య కూడా విడాకులు దారి తీస్తుంది.
తాజాగా ఓ మహిళ.. శృంగారం విషయంలో భర్త చర్యలపై తీవ్ర ఆరోపణలు చేసింది. అనేక సందర్భాల్లో తనతో అసహజ శృంగారంలో పాల్గొన్నాడంటూ కేసు పెట్టింది. తనకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా అలా చేశాడని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. భార్యా భర్తల మధ్య అసహజమైన సెక్స్ అత్యాచారం కిందకు రాదని తీర్పు నిచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ హైకోర్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2019లో ఓ జంటకు పెళ్లైంది. అత్తమామలపై వరకట్న వేధింపుల కేసును దాఖలు చేసిన భార్య.. ఫిబ్రవరి 2020 నుండి పుట్టింటికి వెళ్లిపోయింది. జులై 2022లో భర్త తనతో అసహజ శృంగారానికి పాల్పడ్డాడని, అది అత్యాచారమేనని ఆరోపణలు చేస్తూ మరో కేసు నమోదు చేసింది. విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ హైకోర్టులోని గురుపాల్ సింగ్ అహ్లువాలియా ధర్మాసనం.. మే 1న కీలక తీర్పు వెల్లడించింది.
ఐపీసీలోని సెక్షన్ 375 ప్రకారం.. భర్తతో భార్య అసహజ శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని, భార్య వయస్సు 15 సంవత్సరాల కన్నా తక్కువ లేని నేపథ్యంలో దీన్ని రేప్ గా పరిగణించలేని పేర్కొంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా భారతీయ చట్టాలు ఇంకా గుర్తించలేదని కోర్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో అన్ నాచురల్ సెక్స్ భార్య అనుమతి ప్రాధాన్యం కోల్పోతుందని, తనతో పాటు ఉంటున్న భార్యతో భర్త అసహజ శృంగారానికి పాల్పడితే.. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరంగా పరిగణించలేమని తెలిపింది. అయితే భార్యా భర్తలు విడిగా ఉన్నప్పుడు.. వైఫ్ సమ్మతి లేకుండా సెక్స్ చేస్తే.. సెక్షన్ 376బీ కింద అత్యాచారం అవుతుందని స్పష్టం చేసింది కోర్టు. ఆమె వాదనలను తోసిపుచ్చింది అహ్లువాలియా నేతృత్వంలోని ధర్మాసనం. దీంతో భర్తను కోర్టు నుండి ఊరట లభించినట్లయ్యింది.