iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. హైదరాబాద్ కు 2 బుల్లెట్ ట్రైన్స్! ఈ రూట్లలోనే పరుగులు..

  • Author Soma Sekhar Published - 10:34 PM, Thu - 27 July 23
  • Author Soma Sekhar Published - 10:34 PM, Thu - 27 July 23
గుడ్ న్యూస్.. హైదరాబాద్ కు 2 బుల్లెట్ ట్రైన్స్! ఈ రూట్లలోనే పరుగులు..

మారుతున్న సాంకేతికతకు తగ్గట్లుగా మనం మారితేనే అభివృద్ధి చెందగలం. ఈ విషయాన్ని అర్ధం చేసుకుంది ఇండియన్ రైల్వేస్. అందుకే త్వరలోనే ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ ను పరుగులు పెట్టించనుంది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ త్వరలోనే పరుగులు పెట్టనుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య ట్రాక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు దేశంలో మరో రెండు బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి. అది కూడా హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు రూట్లలోనే. మరి ఈ బుల్లెట్ ట్రైన్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ రైల్వేస్ దేశంలోనే తొలి బుల్లెట్ రైల్ ను నడిపేందుకు సిద్ధమవుతోంది. 2027 నాటికి దేశంలో మెుట్టమెుదటి బుల్లెట్ ట్రైన్ ను పరుగులు పెట్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే హైస్పీడ్ రైల్ లైన్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. భారతీయ రైల్వే మరికొన్ని రూట్లలో బుల్లెట్ ట్రైన్స్ ను నడిపేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. నేషనల్ రైల్ ప్లాన్ లో మరికొన్ని రూట్స్ ప్రతిపాదనలో ఉన్నట్లు లోక్ సభా వేదికగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

ఈ క్రమంలోనే బుల్లెట్ ట్రైన్స్ గురించి లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. జాతీయ రైల్వే ప్రణాళికలో ముంబై-హైదరాబాద్ రూట్ తో పాటుగా ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, చెన్నై-మైసూర్, ముంబై-నాగపూర్, వారణాసి-హౌరా రూట్స్ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జపాన్ ప్రభుత్వం నుంచి ఆర్థిక, సాంకేతిక సహాయంతో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాగా.. ఇండియన్ రైల్వే వెబ్ సైట్ లోని నేషనల్ రైల్ ప్లాన్ లో వివరాల ప్రకారం.. ముంబై-హైదరాబాద్ రూట్ తో పాటుగా హైదరాబాద్-బెంగళూరు రూట్ కూడా ప్రణాళికలో ఉంది. 618 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ.. 2041 నాటికి హైదరాబాద్-బెంగళూరు రూట్లో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది.

ఇక ముంబై-హైదరాబాద్ రూట్ లో బుల్లెట్ రైల్ 2051 నాటికి పూర్తి అవుతుంది. ఈ రెండు బుల్లెట్ ట్రైన్స్ వస్తే.. వందల కీలోమిటర్ల దూరాన్ని అతి తక్కువ సమయంలోనే చేరొచ్చు. దాంతో ప్రయాణికులు ఇప్పుడు పడుతున్న అవస్థలను ఈ బుల్లెట్ ట్రైన్స్ తీర్చనున్నాయి. అయితే ఈ రెండు రూట్స్ లో రెండు బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో 20 సంవత్సరాలకు పైగా సమయం పట్టనుంది. కానీ గడువుకన్నా ముందే ఈ ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్రం. మరి హైదరాబాద్ కు రెండు బుల్లెట్ ట్రైన్స్ వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై కేంద్రం సంచలన నిర్ణయం!