P Krishna
ఇటీవల దేశంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల దేశంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
P Krishna
ఇటీవల దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. కొంతమంది వికలాంగులుగా మారుతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ నర్సింగ్ పూర్ కు సమీపంలో అమర్ వాడా ప్రాంతంలో కేంద్ర మంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాహా మంత్రి ప్రహ్లాద్ పటేల్ కాన్వాలో వెళుతున్నారు. అనుకోకుండా ఓ బైకర్ రాంగ్ రూట్ లో రావడంతో మంత్రి ప్రహ్లాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఎంత కంట్రోల్ చేసుకున్నప్పటికీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రితో పాటు ఇద్దరు గాయపడ్డారు. కాగా బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ పై ఉన్న చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రహ్లాద్ పటేల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో పోటీ చేస్తున్నారు. నర్సింగ్ పూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలు దిగారు. ఈ క్రమంలో ప్రచారం కొనసాగించి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రహ్లాద్ పటేల్ పీఏకి కూడా గాయాలు అయ్యాయి. ఇదిలా ఉంటే సోమవారం గురజాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఆయన కారును ఓ బైకు ఢీ కొట్టింంది.. ఈప్రమాదంతో 50 ఏళ్ల వ్యక్తి కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో మాజీ సీఎం కి ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు