iDreamPost
android-app
ios-app

లోకో ఫైలట్లు చేసిన పనికి.. నరకం చూసిన 2,500 ప్రయాణికులు!

Loco Pilots: చాలా మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాజాగా ఇద్దరు లోకో ఫైలట్ల కారణంగా 2500 మంది ప్రయాణికులు నరకం చూశారు.

Loco Pilots: చాలా మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాజాగా ఇద్దరు లోకో ఫైలట్ల కారణంగా 2500 మంది ప్రయాణికులు నరకం చూశారు.

లోకో ఫైలట్లు చేసిన పనికి.. నరకం చూసిన 2,500 ప్రయాణికులు!

మన దేశంలో ప్రధానమైన రవాణ వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. వీటి ద్వారా నిత్యం ఎంతో మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. అంతేకాక టికెట్ ధరలు చౌకంగా ఉండటంతో రైళ్లలో ప్రయాణించేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే భారతీయ రైల్వే వ్యవస్థ కూడా ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. ఎలాంటి సమస్యలు ఎదురైనా వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు కొందరు అధికారులు, ఉద్యోగులు చేసే నిరక్ష్యపు పనుల కారణంగా ప్యాసింజర్లు నరకం చూస్తుంటారు. తాజాగా ఇద్దరు లోకో ఫైలట్లు చేసిన పనికి దాదాపు 2500 ప్రయాణికులు నరకం చూశారు.

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని బుర్వాల్ జంక్షన్‌లో బుధవారం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆగిపోయాయి. సహర్సా – న్యూఢిల్లీ స్పెషల్ ఫేర్ ఛత్ పూజ స్పెషల్ (04021), బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (15203) రైళ్లలో బుర్వాల్ స్టేషన్ లో ఆగిపోయాయి. సహర్సా నుంచి నవంబర్ 27న రాత్రి 7.15 గంటలకు బయలుదేరాల్సిన స్పెషల్ రైళ్లు నవంబరు 28న ఉదయం 9.30 గంటలకు  బయలుదేరింది. దీంతో ఈ రైలు 19 గంటలు ఆలస్యంగా ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ స్పెషల్ ట్రైన్ కి బుర్వాల్ స్టేషన్ లో హాల్ట్ లేదు. కానీ మధ్యాహ్నం 1:15 గంటలకు షెడ్యూల్ లేకుండా ఆగింది.

ఇదే సమయంలో బరౌని నుంచి లక్నో వెళ్లే రైలు అప్పటికే 5.30 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 4.04 గంటలకు ఈ ట్రైన్‌ కూడా బుర్వాల్ స్టేషన్ కి చేరుకుంది. ఇదే సమయంలో ఈ రెండు రైళ్ల లోక్ ఫైలట్లు ప్రయాణికులకు చిక్కులు చూపించారు. తమ డ్యూటీ టైమ్ అయిపోయిందని ఒక లోకోపైలట్‌, ఆరోగ్యం సరిగ్గా లేదని మరో లోకోపైలట్‌ రైళ్లను వదిలేసి వెళ్లిపోయారు. వీరు చేసిన పనికి రెండు రైళ్లలోని సుమారు 2500 మంది ప్రయాణికులు గంటల కొద్ది నరకం చూశారు. ఆ రైలు లోపల నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

రైల్వే అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు నిరసనకు దిగారు. రైలు పట్టాల మీదకు వచ్చి ఇతర రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. 25 గంటల 20 నిమిషాల్లో తమ ప్రయాణం ముగియాల్సి ఉండగా రైలు ఆలస్యం కారణంగా మూడో రోజూ కూడా రైలులోనే గడపాల్సి వచ్చిందని ఒక ప్రయాణికుడు వాపోయారు. ప్రయాణికులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు.  ఆగిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను కదిలించేందుకు గోండా జంక్షన్ నుంచి సిబ్బందిని పంపించింది. మరి.. లోకో ఫైలేట్లు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.