iDreamPost
android-app
ios-app

వీడియో: నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు.. ఆరుగురు భారతీయులు గల్లంతు!

Two Buses Fell Into The Trishuli River In Nepal: ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. కొండచరియలు విరిగి పడి రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో 65 మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు.

Two Buses Fell Into The Trishuli River In Nepal: ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. కొండచరియలు విరిగి పడి రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో 65 మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు.

వీడియో: నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు.. ఆరుగురు భారతీయులు గల్లంతు!

ఘోర ప్రమాదం సంభవించింది. కొండ చరియలు విరిగిపడటంతో.. రెండు బస్సులు నదిలోకి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదం సమయంలో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ గల్లంతు అయిన వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ఘటన సంభవించింది. ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడటంతో రెండు బస్సులు త్రిశూలి నదిలోకి కొట్టుకుపోయాయి.

కొన్నిరోజులుగా ఈ త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నదికి రెండు వైపులా కొండలు ఉన్నాయి. ఒక కొండకు ఆనుకునే.. ఈ నారాయణ్ ఘాట్- మగ్లింగ్ రోడ్డు ఉంది. ఆ కొండచరియలు విరిగిపడటంతోనే బస్సులు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లాయి. ఈ విషయాలను అధికారులు స్పష్టం చేశారు. ఘటనాస్థలానికి పోలీసులు, జవాన్లు, రెస్క్యూ సిబ్బంది చేరుకుంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బోట్లు వేసుకుని త్రిశూల్ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం త్రిశూల్ నదిలో వరద ఉద్ధృతంగా ఉన్న కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. ఈ కొండచరియలు విరిగిపడటంతో ప్రస్తుతం నారాయణ్ ఘాట్- మగ్లింగ్ రోడ్డు బ్లాక్ అయ్యి ఉంది.

ఖాట్మాండు- బౌండ్ ఏంజెల్ బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నారు. నేపాల్ రాజధాని నుంచి గౌర్ కు వెళ్తున్న గణపతి డీలక్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన భారతీయులకు సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ ఠాకూర్, సురేంద్ర సాహ్, అదిత్ మియాన్, సుని, షహన్వాజ్ అలామ్, అన్సారీలుగా గుర్తించారు. అలాగే బస్సుల్లో కచ్చితంగా 65 మంది ఉన్నారు అనే చెప్పేందుకు వీలు లేదు అని అధికారులు అంటున్నారు. ఎందుకంటే దారిలో వాళ్లు కొంత మందిని ఎక్కించుకునే అవకాశం ఉందని తెలిపారు. నేపాల్ ప్రధాని ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ జూన్ నెల నుంచి నేపాల్ లో ఇప్పటివరకు కొండచరియలు విరిగి పడి 90 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి