Arjun Suravaram
నేటికాలంలో దేశ వ్యాప్తంగా అల్లరిమూకలు, ఆఖతాయిలు పెరిగిపోతున్నారు. రీల్స్ కోసం వింత వింత పనులు చేస్తున్నారు. అంతేకాక దారుణమైన పనులు చేసి...వాటిని కూడా రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు యువకులు ఈ జాబితాలోకి వచ్చి చేరారు.
నేటికాలంలో దేశ వ్యాప్తంగా అల్లరిమూకలు, ఆఖతాయిలు పెరిగిపోతున్నారు. రీల్స్ కోసం వింత వింత పనులు చేస్తున్నారు. అంతేకాక దారుణమైన పనులు చేసి...వాటిని కూడా రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు యువకులు ఈ జాబితాలోకి వచ్చి చేరారు.
Arjun Suravaram
ప్రస్తుతం నడుస్తున్న సోషల్ యుగంలో అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సామాజిక మాద్యామాల కారణంగా ఎంత మంచి జరుగుతుందో అదే స్థాయిలో చెడు జరుగుతుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని కొందరు ఫేమస్ అవుతుంటూ..మరికొందరు మాత్రం తమ కూరత్వాన్ని,పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రీల్స్ కోసం వింత వింత పనులు, నీచమైన పనులు చూస్తున్నారు. మెట్రోల్లో డ్యాన్సులు చేయడం, రోమాన్స్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇక ఇప్పుడు కొందరు ఆకతాయిలు రీల్స్ కోసం ఏకంగా అడవికి నిప్పు పెట్టారు. మరి.… ఈ ఘటన ఎక్కడ జరిగింది?, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నేటికాలంలో దేశ వ్యాప్తంగా అల్లరిమూకలు, ఆఖతాయిలు పెరిగిపోతున్నారు. రీల్స్ కోసం వింత వింత పనులు చేస్తున్నారు. అంతేకాక దారుణమైన పనులు చేసి…వాటిని కూడా రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఒకడు మర్డర్ చేసి వీడియో తీసి రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు యువకులు ఈ జాబితాలోకి వచ్చి చేరారు. చిన్నా చితక పని చేస్తే ఏం మజా వస్తుందని అనుకున్నారో ఏమో కానీ ఏకంగా అడవికే నిప్పుపెట్టారు. చేసిందే వెధవ పని.. అయితే అదే ఘన కార్యం చేసినట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాక తామే అడవిని తగలబెట్టా అని పొగరుగా మాట్లాడిన సన్నివేశం వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది.
ఇక వీడియోలోని ఇద్దరు యువకులు మాట్లాడిని మాటలు వైరల్ అయ్యాయి. ఇక ఆ వీడియోలు.. హలో అబ్బాయిలు, తాము చివరకు నిప్పు పెట్టే పని చేస్తున్నామని ఆ యువకులు చెప్పుకొచ్చారు. తమ పని నిప్పు పెట్టడం, నిప్పుతో ఆడుకోవడంమని, తాము అప్పుడప్పుడు నిప్పుతో ఆడుకుంటామని అన్నారు. తాము నిప్పు పెట్టేందుకే ఇక్కడకు వచ్చామని, తాము పర్వతాన్ని బూడిద చేస్తామని తెలిపారు. నిప్పుతో ఆడుకునే వారిని ఎవరూ సవాలు చేయరని బీహారీలకు ఎప్పుడూ సవాలు లేదని ఆ యువకులు చెప్పినట్లు వీడియోలో స్పష్టమౌతుంది. ఈ ఘటనపై నెటిజన్స్ దీనిపై స్పందిస్తూ పోలీసులు చర్యలు తీసుకుని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Uttrakhand: Instagram post from a handle called “beingsalmankhanx22”, where they are boasting about setting an entire mountain on fire.
2 people are saying – “We will burn the mountain to ashes…never challenge Biharis.”
They started a forest fire & are boasting of it openly. pic.twitter.com/2v2Mn98vQM
— Pagan 🚩 (@paganhindu) May 3, 2024