Nidhan
సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్. టీవీ కేబుల్ బిల్లు తడిసి మోపెడవనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కేబుల్ ధరలు పెరగనున్నాయి. ఎంత మేర పెరగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్. టీవీ కేబుల్ బిల్లు తడిసి మోపెడవనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కేబుల్ ధరలు పెరగనున్నాయి. ఎంత మేర పెరగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
సామాన్యులకు ఎప్పుడూ భయాలే. ఏ వస్తువు ధర పెరుగుతుందో అనే భయం వారిని ఎప్పుడూ వెంటాడుతుంది. కూరగాయలతో పాటు నిత్యావసరాల రేట్స్ ఏటికేడు పెరుగుతూ పోతున్నాయి. కొన్ని వస్తువుల్ని కొనాలంటేనే సామాన్యులు వణికిపోతున్నారు. కరోనా తర్వాత నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోయాయి. నెలవారీ సంపాదనకు, ఖర్చులకు పొంతన లేకుండా పోతోందని చాలా మంది సామాన్యులు వాపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య చాలా మటుకు నిత్యావసరాల ధరలు కాస్త తగ్గాయి. ఈ తరుణంలో కేబుల్ టీవీ ఆపరేటర్లు సామాన్యులకు షాక్ ఇవ్వనున్నారు. వినియోగదారులపై ధరల భారం మోపేందుకు బ్రాడ్కాస్టర్లు రెడీ అవుతున్నారు.
సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్తో పాటు రోజువారీ వార్తలు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు అందరూ టీవీ ఛానల్స్‌ను చూస్తుంటారు. ఇప్పుడు టీవీ లేని ఇల్లు లేదని చెప్పొచ్చు. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ టీవీ ఉండటం కామన్ అయిపోయింది. అయితే మొబైల్ ఫోన్లో ఎంటర్టైన్మెంట్ అయ్యేందుకు ఆప్షన్ ఉన్నా.. సరదాగా కుటుంబ సభ్యులతో కలసి సినిమాలు చూడాలంటే టీవీలోనే సాధ్యం. కరోనా తర్వాత మూవీస్, వెబ్ సిరీస్ చూసే కాలం వచ్చేసింది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లకు అందరూ బాగా అడిక్ట్ అయిపోయారు. టీవీల్లో సీరియల్స్, క్రికెట్ మ్యాచ్‌లు, వార్తలు చూడటం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేసుకోవడం ఎక్కువైంది. అలాగే టీవీ ఛానల్స్‌ను చూసేవారి సంఖ్యా బాగా పెరిగింది. ఈ తరుణంలో కస్టమర్లకు బ్రాడ్కాస్టర్లు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు.
దేశంలో ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీల్లో ఒకటైన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా, వయాకామ్ 18 సంస్థలు తమ కస్టమర్ల నెలవారీ టీవీ బిల్స్ పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇటీవల కాలంలో భారీగా స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను ప్రసారం చేస్తున్న నెట్వర్క్ 18, వయాకామ్ 18 డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియా కాస్ట్.. తమ వినియోగదారుల మీద ఛానెల్ సబ్స్క్రిప్షన్ ఛార్జ్‌ను 20 నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ 9 నుంచి 10 శాతం, సోనీ నెట్వర్క్ 10-11 శాతం పెంచుతున్నట్లు తెలిపాయి. అయితే డిస్నీ స్టార్ మాత్రం ఎంత ఛార్జీ పెంచుతోందో వెల్లడించలేదు. ప్రతిపాదిత ఛార్జీల పెంపు మీద రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్లో ప్రచురించిన 30 రోజుల అనంతరమే పెరిగిన సబ్స్క్రిప్షన్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బ్రాడ్కాస్టర్ల సబ్స్క్రిప్షన్ ఛార్జీలు పెరగనున్నాయి. మరి.. టీవీ కేబుల్ బిల్స్ పెంచడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: దావూద్ ఇబ్రహీం ఇంట్లో సనాతన ధర్మ పాఠశాల!