రైళ్లు పగలు కంటే రాత్రి వేళ స్పీడ్‌గా వెళ్తాయి.. ఎందుకంటే!

Trains Run Faster At Night: భారత రైల్వే వ్యవస్థకు సంబంధించిన అనేక విషయాలు తరచూ వార్తలు కనిపిస్తుంటాయి. అయితే రైల్వేకు సంబంధించిన కొన్ని అంశాలకు గల కారణాలు చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో ఒకటి.. రైలు వేగం అనేది పగటి వేళ కంటే రాత్రి పూట ఎక్కువగా ఉంటుంది.

Trains Run Faster At Night: భారత రైల్వే వ్యవస్థకు సంబంధించిన అనేక విషయాలు తరచూ వార్తలు కనిపిస్తుంటాయి. అయితే రైల్వేకు సంబంధించిన కొన్ని అంశాలకు గల కారణాలు చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో ఒకటి.. రైలు వేగం అనేది పగటి వేళ కంటే రాత్రి పూట ఎక్కువగా ఉంటుంది.

మన దేశంలోని ప్రధాన వ్యవస్థలో రైల్వే  శాఖ ఒకటి. అలానే మన దేశంలోనే ఇండియన్ రైల్వే అనేది అతిపెద్ద రవాణ వ్యవస్థ. ఇందులో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అలానే రైళ్ల ద్వారా నిత్యం లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు.  ట్రైన్‌లో ప్రయాణం ఇతరవాటితో పోల్చుకుంటే చాలా చౌకగా ఉంటుంది. తక్కువ డబ్బుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అందుకే ఎక్కువ మంది రైల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఆ విషయం కాసేపు పక్కన పెడితే..  రైళ్లు పగటి పూట కంటే.. రాత్రి వేళ ఎక్కువ వేగంతో  వెళ్తుంటాయి. ఇలా రాత్రి వేళ  స్పీడ్ గా వెళ్లడానికి గల కారణం చాలామందికి తెలియదు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నిత్యం ఎంతో మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే వివిధ రకాల సరకులను గూడ్స్ ట్రైన్స్ ద్వారా తరలిస్తుంటారు. ఇలా ఇండియన్ రైల్వే వ్యవస్థ  దేశంలోనే అతి పెద్ద వ్యవస్థగా కొనసాగుతుంది. ఇక రైళ్ల జర్నీ గమనించినట్లు అయితే పగటి పూట రైళ్ల స్పీడ్ తో పోలీస్తే రాత్రి వేళ చాలా వేగంగా ఉంటుంది. అందుకే రాత్రి వేళ జర్నికి సమయం తగ్గువ పడుతుంది. అయితే ఇలా రైళ్లు  రాత్రి వేళ స్పీడ్ గా వెళ్తాయని తెలుసు. కానీ ఎందుకు పగటి కంటే రాత్రి వెళ్ల వేగంగా వెళ్తాయనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

పగటితో పోలీస్తే రాత్రి వేళల్లో రైలు పట్టాలపై రద్దీ తక్కువగా ఉంటుంది.  అలానే పగటిపూట సరకు రవాణ, ప్యాసింజర్ రైళ్లు తిరుగుతుంటాయి. వీటితో పాటు రైల్వే నిర్వహణ పనులు జరుగుతుంటాయి. వీటి కారణంగా పగటి వేళ రైళ్ల వేగం తక్కువగా ఉంటుంది. అలానే వాతావరణంలోని ఉష్ణోగ్రత కారణంగా కూడా రైళ్ల వేగంగలో తేడాలు ఉంటాయి. రాత్రి  ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీని కారణంగా పట్టాలకు, రైళ్లు చక్రాలకు మధ్య రాపిడి తక్కువగా ఉంటుంది. తక్కువ రాపిడి కారణంగా రైళ్లు అధిక వేగంతో  నడుస్తాయి.

రైలు వేగంలో మార్పులకు సిగ్నల్ కూడా ఒక కారణం.  రైళ్లకు ఇచ్చే సిగ్నళ్లు రాత్రి వేళ తగ్గుతాయి. దీని కారణంగా రైళ్లు ఎక్కువ సార్లు ఆగే అవసరం ఉండదు. తద్వారా టైమ్ సేవ్ కావడంతో పాటు వేగం అధికంగా ఉంటుంది. అలానే రైల్వే ట్రాక్ లు, ఇతర రైల్వే పనులు రాత్రి పూట తక్కువగా ఉంటాయి. దీంతో రైళ్ల  స్పీడ్ కు  అంతరాయం ఉండదు. అలానే రాత్రి వేళల్లో జంతువులు రైలు పట్టాలపైకి వచ్చే చాలా తక్కువ అవకాశం ఉంటుంది. దీని కారణంగా రైళ్లను అకస్మాత్తుగా ఆపాల్సిన అవసరం ఉండదు. పై అంశాలే కాకుండా ట్రాక్ పరిస్థితి, ఏ రకానికి చెందిన రైలు, వెదర్ వంటి అనేక అంశాలపై రైళ్ల వేగం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా ఈ కారణాలతో పగటి పూట కంటే రాత్రి వేళల రైళ్ల వేగం ఎక్కువగా ఉంటుంది.

Show comments