Arjun Suravaram
Delhi Train:రైళ్ల వేగం, జర్నీ టైమింగ్స్ వంటి విషయాల్లో పలు నిబంధనలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ.. రైళ్లు నడుస్తుంటాయి. తాజాగా 20కి.మీ వేగంతో వెళ్లాల్సిన ప్రాంతంలో.. 120తో వెళ్లిన రైళ్లు వెళ్లాయి.
Delhi Train:రైళ్ల వేగం, జర్నీ టైమింగ్స్ వంటి విషయాల్లో పలు నిబంధనలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ.. రైళ్లు నడుస్తుంటాయి. తాజాగా 20కి.మీ వేగంతో వెళ్లాల్సిన ప్రాంతంలో.. 120తో వెళ్లిన రైళ్లు వెళ్లాయి.
Arjun Suravaram
సాధారణంగా ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. అలానే మిగిలిన వాటితో పోల్చితే రైలు టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి. నిత్యం వేలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చడంలో రైళ్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇది ఇలా ఉంటే కొన్ని సందర్భాల్లో రైళ్లను నడిపే లోకో పైలెట్ లు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణం అవుతుంటారు. తాజాగా రెండు రైళ్ల విషయం అలాంటిదే జరిగింది. గంటకు 20 కి.మీతో వెళ్లాల్సిన ప్రాంతంలో 120 కి.మీ వేగంతో రెండు రైళ్లు దూసుకెళ్లాయి. దీంతో అసలు విషయం తెలిసి ప్రయాణికులు షాకయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రైళ్ల వేగం, జర్నీ టైమింగ్స్ వంటి విషయాల్లో పలు నిబంధనలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ.. రైళ్లు నడుస్తుంటాయి. ముఖ్యంగా రైల్వేకు సంబంధించిన పనులు, మరమ్మత్తులు జరుగుతున్నప్పుడు అటుగా వెళ్లే రైళ్లకు కీలక ఆదేశాలను జారీ చేస్తుంటారు. అయితే అందరూ లోక్ ఫైలెట్లు ఇతర అధికారులు ఆ రూల్స్ ను ఫాలో అవుతుంటారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలానే తాజాగా రెండు రైళ్లకు సంబంధించిన విషయంలో పైలట్లు అలానే వ్యవహరించారు. గంటకు 20కి.మీ వేగ పరిమితి ఉన్నచోట 120 కి.మీ వేగంతో రైళ్లను నడిపినట్లు గుర్తించిన అధికారులు.. గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంబంధించిన లోకో పైలట్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఆగ్రా కంటోన్మెంట్‌కు సమీపంలోని జజువా, మనియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన సంబంధించిన మరమ్మతులు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ వంతెన పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లు గంటకు 20 కి.మీ వేగంతో వెళ్లాలని అధికారులు సూచించారు.. అయితే, దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్, ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ జంక్షన్‌ల మధ్య నడిచే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం గంటకు దాదాపు 120కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత కాట్రా నుంచి ఇందౌర్‌ల మధ్య నడిచే మాల్వా ఎక్స్‌ప్రెస్ విషయంలోనూ అదే ప్రాంతంలో ఈ తరహా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఈ రెండు రైళ్లు వేగంగా వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి ఉల్లంఘనలు జరిగినప్పుడు అస్టిస్టెంట్ లోకోపైలట్ కు గట్టిగా చెబుతారని, వాటిని లోకో పైలట్ చెప్పే విధానం ఉంటుందని అధికారులు తెలిపారు. అయినా కూడా ఈ తప్పు జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికి కీలక హెచ్చరికలను ఉల్లంఘిస్తూ వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెట్టడమే అవుతుందని అధికారులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరి పైలట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.