టోల్స్ కట్టేవారికి కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గించేశారు!

New Toll Plazas Rules: ఇటీవల దేశ వ్యాప్తంగా టోల్ పాయింట్స్ వద్ద ఏక పక్ష్గంగా చార్జీలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టోల్ చార్జీ విషయంలో కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది.

New Toll Plazas Rules: ఇటీవల దేశ వ్యాప్తంగా టోల్ పాయింట్స్ వద్ద ఏక పక్ష్గంగా చార్జీలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టోల్ చార్జీ విషయంలో కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది.

ఇటీవల దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఇష్టానుసారంగా చార్జీలు వసూళ్లు చేస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త టోల్ వసూళ్లు, గ్లోబల్ నావిగేషన్ శాలిటైట్ సిస్టమ్ (GNSS) కొత్త విధానాన్ని ప్రకటించింది. ఉపగ్రహ ఆధారిత సిస్టమ్ లో టోల్ ఫీజు వసూలు కోసం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), అన్ బోర్డ్ యూనిట్ (ఓబీయూ) ఉపయోగపడుతందని అంటున్నారు. ఈ వ్యవస్థ మొదట ప్రధాన రహదారులు, ఎక్స్ ప్రెస్ వేలలో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు టెక్నాలజీ వంటికి అధనంగా ఉండబోతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జాతీయ రహదారులపై టోల్ ఫీజు వసూళ్ల విషయంపై కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై శాటిలైట్ విధానం ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ ఫీజ్ వసూలు విధానం ఖారారు చేసింది. ప్రైవేట్ వాహనాలకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ట్యాక్స్ విధించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు 2008 నాటి నేషనల్ హైవే ఫీజు సవరిస్తూ కొత్త విధానాన్ని మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సవరణ ప్రకారం ప్రైవేట్ వాహనదారులకు కొంత ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. బెంగుళూరు – మైసూరు పరిధిలోని ఎన్ హెచ్ – 275 పై ఈ విధానం అమలుకు సంబంధించి ప్రయోగం ఇప్పటికే విజయవంతం అయ్యింది. ఈ విధానం ప్రకారం హైవైపై మీ వాహనం 30 కిలో మీటర్లు ప్రయాణిస్తూ కేవలం 10 కిలోమీటర్లకు మాత్రమే టోల్ ఫీజ్ కడితే సరిపోతుంది.. 20 కిలోమీటర్ల పూర్తిగా ఉచితం.. ఎలాంటి ఫీజు వసూలు చేయరు. ఈ కొత్త విధానం ప్రకారం ప్రయాణించిన దూరానికి టోల్ ఫీజు కడితే సరిపోతుంది.

కేంద్రం తీసుకువచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై టోల్ గేట్ వద్ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా టోల్ చార్జీలు వసూలు చేసే విధానం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫాస్టాగ్, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు టెక్నాలజీ వంటి వాటికి ఇది అదనంగా ఉంటుంది. ఇకపై నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ తో యూనిట్ కలిగి ఉన్న వాహనాలు టోల్ గేట్ల మీదుగా వెళ్లినపుడు ఆ వాహనం ప్రయాణించిన దూరానికే టోల్ ఫీ ఆటోమెటిక్ గా కట్ అయిపోతుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా మ్యానువల్ అవసరాలు ఉండవు.. డ్రైవర్ల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది.పెద్దగా ట్రాఫిక్ జామ్ ఉండదు. హైవేలపై అమర్చిన సీసీ కెమెరాలు వాహనాలు ఎక్కడున్నాయో నిర్ధారిస్తాయి.. దాన్ని బట్టి టోల్ ఫీజ్ వసూలు చేస్తారు.

Show comments