iDreamPost
android-app
ios-app

దారుణ ఘటన.. టీచర్‌ను క్లాస్‌ రూమ్‌లోనే కాల్చి చంపిన విద్యార్థి!

  • Published May 05, 2024 | 4:16 PM Updated Updated May 05, 2024 | 4:16 PM

ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రేమోన్మాదోలు రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను కాదన్న యువతులను టార్గెట్ చేసుకొని దారుణాలకు పాల్పపడుతున్నారు.

ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రేమోన్మాదోలు రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను కాదన్న యువతులను టార్గెట్ చేసుకొని దారుణాలకు పాల్పపడుతున్నారు.

దారుణ ఘటన.. టీచర్‌ను క్లాస్‌ రూమ్‌లోనే కాల్చి చంపిన విద్యార్థి!

మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈ మధ్య కొంతమంది ఉన్మాదులు ఆడవాళ్లపై ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంకిగ వేధింపులకు పాల్పపడుతున్నారు. ఒంటరిగా మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.ఇటీవల దేశంలో పలు చోట్ల ప్రేమోన్మాదులు తమ ప్రేమను కాదన్న యువతులను అత్యంత పశవికంగా హతమార్చుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్‌లో చోటు చేసుకుంది. ఓ టీచర్ పై స్టూడెంట్ దారుణానికి పాల్పపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. బిజ్నోర్ లో ఓ విద్యార్థి టీచర్ పై దారణానికి పాల్పపడ్డాడు. ఆ టీచర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆస్పత్రిలో 33 గంటల వరకు పోరాడి చివరికి కన్నుమూసింది. ఆ యువతి శరీరం నుంచి బుల్లెట్ ని వైద్యులు బయటకు తీయలేకపోవడంతో ప్రాణాలు విడిచింది. గత కొంత కాలంగా ఓ విద్యార్థి ఆమెను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతున్నాడు.. అందుకు ఆ టీచర్ నిరాకరించడం వల్ల ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిజ్నోర్ లోని కోమల్ (25) అనే టీచర్ కంప్యూటర్ సెంటర్ లో ఫ్యాకల్టీగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చిన ప్రశాంత్ అనే స్టూడెంట్ .. కోమల్ ని ఇష్టపడటం మొదలు పెట్టాడు. తన ప్రేమ గురించి పదే పదే కోమల్ కి చెప్పాడు.. ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. ఈ క్రమం టచర్ పై కక్ష్య పెంచుకున్నాడు స్టూడెంట్.

ప్రతిరోజూ లాగే శుక్రవారం కోమల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లింది. స్టూడెంట్ కి క్లాస్ తీసుకుంటుంది కోమల్. అంతలోనే గన్ తో వచ్చిన ప్రశాంత్.. కోమల్ పై కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోయాడు. వెంటనే ఇన్స్టిట్యూట్ యాజమాన్యం కోమల్ ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బుల్లెట్ ని ఆమె శరీరంలో నుంచి డాక్టర్లు తీయలేకపోయారు. దీంతో 33 గంటల పాటు కమల్ మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచింది. ఘటన అనంతరం పోలీసులు నిందితుడు ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం రుచిత్ అనే వ్యక్తి వద్ద గన్ తీసుకున్నట్లు ప్రశాంత్ తెలిపాడు. 2022 లో ప్రశాంత్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కొర్సు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.