iDreamPost
android-app
ios-app

సిగ్నల్ పడినా ఆగని రైలు.. అదే లైన్ లో మరో ఎక్స్‌ప్రెస్!

అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో అధికారులు, లోకో ఫైలెట్ల అప్రమత్తం కావడంతో పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. తాజాగా శివగంగా ఎక్స్ ప్రెస్ సిగ్నల్ పడినా ఆగకుండా స్టేషన్ వైపు తీసుకెళ్లింది.

అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో అధికారులు, లోకో ఫైలెట్ల అప్రమత్తం కావడంతో పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. తాజాగా శివగంగా ఎక్స్ ప్రెస్ సిగ్నల్ పడినా ఆగకుండా స్టేషన్ వైపు తీసుకెళ్లింది.

సిగ్నల్ పడినా ఆగని రైలు.. అదే లైన్ లో మరో ఎక్స్‌ప్రెస్!

నిత్యం వివిధ రకాల ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. అందులో మోజార్టీ రోడ్డు ప్రమాదాలు ఉంటాయి. అలానే తరచూ రైలు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. సాంకేతిక లోపం, సిగ్నలింగ్ లో సమస్య, పట్టాలు విరగడం, కమ్యూనికేషన్ లోపం వంటి కారణాలతో రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని నెలల క్రితం ఒరిస్సాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ , బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు290 మంది మరణించారు. తాజాగా ఆ తరహాలో ఓ ఘటన జరిగేది.. కానీ అధికారులు అప్రమత్తం కావడంతో తృటిలో ఆ పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో శివగంగ ఎక్స్ ప్రెస్ రైల్ కి రెడ్ సిగ్నల్ పడింది. అయినా  కూడా ఆ ట్రైన్ ఆగకుండా సుమారు కిలోమీటర్ దూరం ముందుకు వెళ్లింది. అదే సమయంలో స్టేషన్ లో అదే  లైన్ పై మరో ట్రైన్ ఉంది. అక్కడ ఉన్న అందరూ తెగ టెన్షన్ పడిపోయారు. అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ-హావ్‌డా మార్గంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఇటావా జిల్లాలో భర్థనా స్టేషనుకు అయిదు కిలోమీటర్ల దూరంలో 507 నంబరు వద్ద రెడ్‌సిగ్నల్‌ పడింది. ఆ సమయంలో శివగంగా ఎక్స్ ప్రెస్ రైలు సుమారు 80 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. రెడ్‌సిగ్నల్‌ను పట్టించుకోని లోకో పైలట్లు రైలును అలాగే ముందుకు పోనిచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో శివగంగ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెడ్‌సిగ్నల్‌ పడినా ఆగకుండా సుమారు కిలోమీటరు దూరం ముందుకు దూసుకొచ్చింది. ఆ సమయంలో స్టేషనులోని అదే లైన్ మీద హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగి ఉంది. ఇక స్టేషన్ వైపు దూసుకువస్తున్న ‘శివగంగ’ను గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై కరెంట్ సప్లయ్ ను నిలిపివేశారు. దీంతో రైలు మరికాస్తా దూరం వెళ్లి.. ఆగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఇక సిగ్నల్ ఇచ్చిన ఆపకుండా వెళ్లిన శివగంగ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన ఇద్దరు లోకోపైలట్లను అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు చేశారు. ఇక ఈ ఘటనపై అధికారులు స్పందించారు.

రైల్వే అధికారులు మాట్లాడుతూ.. కాన్పుర్‌-ఢిల్లీ మార్గం మధ్యలో చాలా పటిష్ఠమైన ఆటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ ఉందన్నారు. అలానే వైఫల్యాలకు అవకాశం ఉండదని, ఉదయం సమయం కావడంతో మంచు కారణంగా సిగ్నల్‌ కనిపించకుండాపోయే అవకాశం ఉందని తెలిపారు. అయినా లోకోపైలట్లు ఎందుకు అప్రమత్తంగా లేరన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో ఇద్దరు లోకోపైలట్లదే తప్పు అని తేలితే..వారిపై చర్యలు తీసుకుంటామని ఉత్తర మధ్య రైల్వే పీఆర్‌వో అమిత్‌సింగ్‌ తెలిపారు. ఇలా సాంకేతిక లోపం కారణంగానే ఇటీవలే పలాస ప్యాసింజర్ కూడా విజయనగరం జిల్లాలో ప్రమాదానికి గురైంది.  ఆతరువాత కూడా అనేక రైలు ప్రమాదా ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా రైల్లో ప్రయాణించేందుకు భయపడుతున్నామని కొందరు చెప్పడం గమన్హారం. మరి.. తాజాగా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.