iDreamPost
android-app
ios-app

ఆర్టికల్ 370 రద్దు సరైనదే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

  • Published Dec 11, 2023 | 12:30 PM Updated Updated Dec 11, 2023 | 12:30 PM

2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.. ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.. ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

  • Published Dec 11, 2023 | 12:30 PMUpdated Dec 11, 2023 | 12:30 PM
ఆర్టికల్ 370 రద్దు సరైనదే..  సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

దేశంలో ఆర్టికల్ 370 గురించి తెలియని వారు ఉండరు. 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ కి ప్రత్యేక హూదాను ఉపసంహరిస్తూ.. ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్ సమానమే అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనిని స్థానిక రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున వ్యతిరేయించాయి.. అంతేకాదు ఆర్టికల్ 370 రద్దు విషయంపై ఆందోళనలు మొదలయ్యాయి.  రద్దును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పుఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హూదాని ఉపసంహరిస్తూ.. ఆర్టికల్ 370 ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370, 35 ఏ లను రద్దు చేసిన తర్వాత కొంతమంది స్థానిక ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. కొంతమది ఈ రద్దును సమర్ధిస్తే.. మరికొంతమది దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతే కాదు ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు ఈ రోజు (సోమవారం) సంచలన తీర్పు వెల్లడించింది. పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలో 5 గురు సభ్యుల బెంజ్ ఈ సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేని సుప్రీం కోర్టు తెలిపింది.

Abrogation of Article 370 is right Supreme Court sensational verdict

భారత దేశంలో కశ్మీర్ ని కలిసే సమయంలో ప్రత్యేక సార్వ భౌమత్వం ఏమీ లేదని తీర్పులో వ్యాఖ్యానించింది. నాటి ప్రత్యేక పరిస్థితులు, యుద్దం కారణంగా ఈ ఆర్టికల్ ని రూపొందించారని.. దేశంలో అన్ని ప్రాంతాలతోపాటు జమ్మూ కాశ్మీర్ కూడా సమానమే అని.. భారత్ లో కాశ్మీర్ విలీనమైనపుడు ప్రత్యేక హూదాలు ఏవీ లేవని ప్రభుత్వం గుర్తు చేసింది. అప్పుడు రూపొందించిన ఆర్టికలే తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్ ఉన్నారు. అర్టికల్ రద్దు సరైనదే అన్న సీజేఐ.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అసవరం లేదు అని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పూర్తిగా సమర్ధించినట్లే అయ్యింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.