Arjun Suravaram
ఇటీవల కాలంలో పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయి. కారణం ఏదైనప్పటికి ఇలాంటి ఘటనల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమదాంలో ఎనిమిది మంది మరణించారు.
ఇటీవల కాలంలో పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయి. కారణం ఏదైనప్పటికి ఇలాంటి ఘటనల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమదాంలో ఎనిమిది మంది మరణించారు.
Arjun Suravaram
చాలా మంది కుటుంబ జీవనం కోసం కర్మాగారాల్లో పని చేస్తుంటారు. రోజూ పనికి వెళ్తేనే కానీ పూటగడపలేని కుటుంబాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వారు.. తాము చేస్తున్న పనిలో పొంచి ఉన్న ప్రమాదాన్ని సైతం మర్చిపోయీ..పని చేస్తుంటారు. ఏదైన జరగరానిది జరిగితే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా బతకడం కోసం తప్పక చేస్తున్నారు. ఇలా ఆయిల్, ఫార్మా, బాణ సంచా తయారి వంటి కర్మాగారాల్లో ఎంతో మంది పని చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగి.. పలువురు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ కర్మాగారంలో ఘోర ప్రమాదాం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్ నగర్ జిల్లా వీరగలూర్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం వెంబకొట్టాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరగలూర్ గ్రామంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 11 మందికి తీవ్రంగా గాయపడ్డినట్లు సమాచారం. ఇక మరణంచిన వారిలో మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం కూడా బాణసంచా కేంద్రంలో కార్మికులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇలా అందరు తమ పనుల్లో ఉండగా.. కెమికల్ మిక్సింగ్ రూమ్ లో భారీ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇక ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీతో పాటు సమీపంలో ఉన్న మరో నాలుగు భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు ఘటనలో ప్రమాద స్థలంలో ఏడుగురు మరణించగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు.
ఈ క్షతగాత్రులను స్థానిక శివకాశి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనను రాష్ట్ర రవాణ శాఖ, కార్మిక శాఖ మంత్రులు ఎస్ఎస్ శివశంకర్, సీవీ గణేషన్ ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న రెస్క్యూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక ఈ పేలుడు ఘటనలో మరణించిన వారికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం స్టాలిన్ ప్రకటించారు. అలానే గాయపడిన వారికి రూ.1 లక్షను చికిత్స నిమిత్తం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. మరి.. ఈ ఘోరమైన ఘటనకు బాధ్యులు ఎవరు?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.