iDreamPost
android-app
ios-app

వీడియో: పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదం.. అగ్నికి ఆహుతైన EVMలు!

మంగళవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలింగ్ ముగిసి తిరిగి వెళ్తున్న సిబ్బంది బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఈవీఎంలు అగ్నికి ఆహుతయ్యాయి. మరి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..

మంగళవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలింగ్ ముగిసి తిరిగి వెళ్తున్న సిబ్బంది బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఈవీఎంలు అగ్నికి ఆహుతయ్యాయి. మరి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..

వీడియో: పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదం.. అగ్నికి ఆహుతైన EVMలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హాడావుడి నడుస్తోంది. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 13న జరగనున్న నాలుగో దశ పోలింగ్ కి అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రచారంలో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్నాయి. ఇలా ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ.. అనుకోని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండో విడత పోలింగ్ ముగిసిన తరువాత ఓ ప్రాంతంలో ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. తాజాగా మూడో విడత పోలింగ్ ముగిసిన తరువాత కూడా ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది.  ఈఘటనలో కొన్ని ఈవీఎంలో కాలిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి ఎన్నికల సిబ్బంది బస్సు ప్రమాదానికి గురైంది. బేతుల్ కలెక్టర్ నరేంద్ర సూర్యవన్షీ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బేతుల్ జిల్లా గొలా గ్రామం సమీపంలో పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. పోలింగ్ ముగిసిన తరువాత తిరిగి వస్తుండగా.. బస్సులో అనుకోకుండా మంటలు చెలరేగాయని కలెక్టర్ తెలిపారు. దీంతో క్షణాల్లో ఆ బస్సులో మంటలు వ్యాప్తించాయి. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల సిబ్బంది సురక్షితంగా బయటకు దిగారు.

ఈ ప్రమాదంలో పోలింగ్ సిబ్బంది, బస్సు డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. అయితే కొన్ని ఈవీఎంలకు మాత్రం స్వలంగా ధ్వంసమైనట్లు అధికారులు చెబుతున్నారు. బస్సు ఇంజిన్‌లో సమస్యతోనే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అలానే బేతుల్  జిల్లాలో కూడా మూడో విడత పోలింగ్ జరిగింది. బేతుల్ లోక్‌సభ పరిధిలో మొత్తం 72.65 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే ఓ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి ఎన్నికల సిబ్బంది తిరిగి బయలు దేరారు. ఈ క్రమంలోనే వారి బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

ఈ ఘటనలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మాత్రం అగ్ని ప్రమాదం వల్ల దెబ్బతిన్నట్లు ఆ కలెక్టర్ పేర్కొన్నారు. పొలింగ్ బూత్ నెం. 275, 276,277,278,279,280లోని ఈవీఎంలతో పాటు మరికొన్ని బూత్‌ ల్లోని ఈవీఎంలకు పాడైనట్టు  అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా  మంటల్లో కాలిపోయింది. అగ్ని ప్రమాదం జరిగిన బస్సులో ఆరు పోలింగ్ కేంద్రాల్లోని సిబ్బంది, ఈవీఎంలు ఉన్నాయని తెలిపారు. వీటిలో నాలుగు ధ్వంసమయ్యాయని, రెండు మాత్రం భద్రంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని, ప్రభావిత బూత్‌లలో రీపోలింగ్‌పై ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుదని కలెక్టర్ తెలిపారు.