iDreamPost
android-app
ios-app

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది విద్యార్థులు!

School Bus Accident: స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి.. విద్యార్థులు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్ లో ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 8 మంది విద్యార్థులు జలసమాధి అయ్యారు. తాజాగా ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది.

School Bus Accident: స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి.. విద్యార్థులు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్ లో ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 8 మంది విద్యార్థులు జలసమాధి అయ్యారు. తాజాగా ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది విద్యార్థులు!

నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా జరిగే వాటి కంటే.. నిర్లక్ష్యగా జరిగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అతివేగం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే.. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్ లు కూడ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి.. విద్యార్థులు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్ లో ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 8 మంది విద్యార్థులు జలసమాధి అయ్యారు. తాజాగా ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. అందులోని 15 మంది చిన్నారులకు గాయలయ్యాయి. ఈ ఘటన ఝార్ఖాండ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఝార్ఖండ్‌లోని రాంచీ పట్టణంలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు మూల మలుపు వద్దు అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. రాంచీలోని మందర్‌లో సెయింట్‌ మరియా పాఠశాలకు 150 మీటర్ల దూరంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో 30 చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగే కాసేపుటి ముందే.. 16 మంది విద్యార్థులు బస్సు ఎక్కారు. అయితే రోజు కంటే శనివారం బస్సు 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆ బస్సు డ్రైవర్ వేరేవారితో  ఫోన్ లో మాట్లాడుతూ. అతివేగంగా వాహనం నడిపాడని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారు అయినట్లు స్థానికులు చెబుతున్నారు.

శనివారం ఉదయం 30 మంది విద్యార్థులతో బయలు దేరిన బస్సు.. సదరు పాఠశాలకు 150 మీటర్ల దూరంలో మూల మలుపు వద్దు బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయింది. ఈ ఘటన 15 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గమనించిన స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే ఎవరి పరిస్థితి విషయం లేదని స్థానిక పోలీసులు తెలిపారు. అలానే చిన్న చిన్న గాయాలైన పిల్లలకు చికిత్స చేసి వారికి ఇంటికి పంపించారు. మిగిలిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుతూ..నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఇలా గతంలో నెల్లూరు జిల్లాలో కూడా ఓ బస్సు అదుతప్పి పంట పొలాల్లోకి వెళ్లింది. ఆ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి  ప్రమాదం జరగలేదు. కానీ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా ఎంతో మంది అమాయకులు బలవుతుంటారు. మూడు రోజుల క్రితం కోదాడ లో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. అలానే నిన్న నిజమాబాద్ లో ఐచర్ వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మృతిచెందడమే కాకుండా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.