Arjun Suravaram
కొందరు నిర్లక్ష్యంగా చేసే పనులు పెను అనర్ధాలకు దారి తీస్తుంటాయి. జాగా తన తండ్రితో కలిసి రోడ్డుపై నిల్చున్న నాలుగేళ్ల చిన్నారిని.. ఓ వ్యక్తి బలి తీసుకున్నాడు. రోడ్డుపై చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు.
కొందరు నిర్లక్ష్యంగా చేసే పనులు పెను అనర్ధాలకు దారి తీస్తుంటాయి. జాగా తన తండ్రితో కలిసి రోడ్డుపై నిల్చున్న నాలుగేళ్ల చిన్నారిని.. ఓ వ్యక్తి బలి తీసుకున్నాడు. రోడ్డుపై చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు.
Arjun Suravaram
కొందరు నిర్లక్ష్యంగా చేసే పనులు పెను అనర్ధాలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా డ్రైవింగ్ వంటి విషయాల్లో కొందరు చూపించే నిర్లక్ష్యంగా అనేక కుటుంబాల్లో చీకట్లను నింపేలా చేస్తాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగంగా వాహనం నడపడం వంటి కారణాలతో.. ఏమి తెలియని అమాయకులు నిర్ధాక్షణ్యంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా తన తండ్రితో కలిసి రోడ్డుపై నిల్చున్న నాలుగేళ్ల చిన్నారిని.. ఓ వ్యక్తి బలి తీసుకున్నాడు. రోడ్డుపై చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో కిరణ్ గుప్తా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు కావ్య అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇక ఆ పాపను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. సోమవారం సాయంత్రం చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘోరమైన ఘటనలో కావ్య ప్రాణాలు పోయాయి. సోమవారం సాయంత్రం కిరణ్ గుప్తా తన కుటుంబంతో కలిసి.. నగరంలోని పాడేపూర్ కి వెళ్లారు.
అక్కడి నుంచి చౌబేరి ప్రాంతానికి వెళ్లేందుకు బస్సు కోసం రోడ్డుపై ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో కిరణ్ గుప్తా భార్య, ఆమె సోదరుడు రోడ్డుకు మరోవైపు నిల్చున్నారు. కిరణ్ గుప్తా..చిన్నారి కావ్య మరోవైపు నిల్చున్నారు. కావ్య తల్లి రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో తన తండ్రి చేతులను వదిలించుకుని తల్లివైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ అమాయక చిన్నారిని వేగంగా వచ్చిన బైక్ రైడర్ బలంగా ఢీకొట్టడంతో ఆమె మరణించింది. ఈ దారుణ ఘటన దృశ్యాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు అవుతుంది. నిర్లక్ష్యంగా బైక్ నడిపుతూ వెళ్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. చిన్నారి..తన చేయి విడిపించుకుని వెళ్లిన విషయం కిరణ్ గుప్తా కూడా గమనించలేదు. ప్రమాదం జరిగిన తరువాత వెంటనే షాకయ్యాడు.
ఇక వేగంగా వచ్చిన బైక్ ఆ చిన్నారిని 60-70 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రగాయలైన కావ్య..అక్కడికక్కడే మరణించింది. చిన్నారి ఢీకొట్టిన వ్యక్తి పట్టుకునేందుకు రోడ్డుకు ఎదురుగా వేచి ఉన్న చిన్నారి తల్లి, సోదరుడు బైక్‌ను వెంబడించారు. అనంతరం మృతురాలి తండ్రి కూడా బైక్‌ని వెంబడించాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిని ఢీకొట్టిన బైకర్‌ను పట్టుకోవడానికి గాలింపు చేపట్టారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప విగత జీవిగా మారడంతో కిరణ్ గుప్తా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
यूपी के वाराणसी में बुधवार शाम एक तेज रफ्तार बाइक सवार ने 4 साल की मासूम को टक्कर मार दी। pic.twitter.com/HZMlAp0YIT
— Rakesh chaudhari (@Rakeshchau58578) May 23, 2024