iDreamPost
android-app
ios-app

పెళ్లింట తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో మృతి!

  • Published Apr 24, 2024 | 3:34 PM Updated Updated Apr 24, 2024 | 3:34 PM

Rajasthan News: ఇటీవల దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా వివాహ వేడుకల్లో ఇలాంటి విషాద ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.

Rajasthan News: ఇటీవల దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా వివాహ వేడుకల్లో ఇలాంటి విషాద ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.

పెళ్లింట తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో మృతి!

ఇటీవల దేశంలో గుండెపోటు తో ఎంతోమంది చనిపోతున్నారు. చిన్నా పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ కి గురై చనిపోతున్నారు. ఎక్కువగా వ్యాయామం చేయడం, పని ఒత్తిడి, మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, డీజే సౌండ్స్ వినడం, ఎక్కువగా డ్యాన్స్ చేయడం ఇలా ఎన్నో కారణాల వల్ల హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతున్నారు. అప్పటి వరకు తమతో ఎంతో హ్యాపీగా గడిపిన వాళ్లు హఠాత్తుగా తమ కళ్ల ముందే చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.ఈ మద్య కాలంలో ఎక్కువగా వివాహ వేడుకల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తన మేనళ్లుడి పెళ్లి ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ మామ చనిపోవడం తీవ్ర విషాదాన్నినింపింది. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ నవాల్ ఘర్ ప్రాంతానికి చెందిన కమలేష్ తన మేనల్లుడు, మేన కోడలి పెళ్లికి వెళ్లాడు. మేనకోడలి వివాహం ఏప్రిల్ 19 న జరిగింది. అతని మేనల్లుడు పంకజ్ వివాహం ఏప్రిల్ 21 న జరిగింది. కమలేష్ సొదరుడు ఇంద్రజ్ ధాకా, కుటుంబ సభ్యులతో కలిసి 20న చోటా భాల్ పూరించడానికి లోచ్వాలోని ధానికి వెల్లారు. ఆ సమయంలో కుండలో బియ్యం నింపాడు. పూజలో తలపై కుండ పెట్టుకొని ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేశాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా విజిల్స్ అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంతలోనే కమలేష్ కింద పడిపోయారు. అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే కమలేష్ ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. అప్పంటి వరకు సంతోషంగా ఉన్న పెళ్లి వాతావరణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.

మృతుడు కమలేష్ సవాల్ ఘర్ లోని చౌకని గ్యాలో ఏజెన్సీలో పనిచేస్తూ ఇంటింటికి గ్యాస్ సిలిండ్లు పంపిణీ చేసేవాడు. ఎంతో ఆనందంగా తన మేనల్లుడు, మేనకోడలి వివాహ వేడుకకు వెళ్లి అనూహ్యంహంగా కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలేష్ డ్యాన్స్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఒక్కసారే కిందపడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ.. డ్యాన్స్, పాటలు పాడుతూ సంతోషంగా ఉండేవాడని.. ఇలా హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూస్తాడని అనుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు.